Asia Cup 2025 Suryakumar Yadav: ఆసియా కప్ లో సూర్యకుమార్ సారథ్యంలో భారత జట్టు రేపు అబుదాబి వేదికగా హాంకాంగ్ జట్టుతో తలపడుతుంది. వాస్తవానికి ఈ మ్యాచ్ మీద భారత అభిమానులకు ఎటువంటి అనుమానం లేదు. పైగా ఈ మ్యాచ్లో భారత జట్టు చేసే స్కోర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే పొట్టి ఫార్మాట్లో టీమ్ ఇండియా ఇంతవరకు 300 స్కోర్ చేయలేదు. ఒకవేళ అన్నీ కలిసి వస్తే ఈ మ్యాచ్లో ఆ స్కోర్ చేసే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. పొట్టి ఫార్మాట్లో హాంకాంగ్ పసికూన లాంటి జట్టు. అయితే ఈ జట్టు మీద టీమిండియా తన అగ్ర ఆటగాళ్లతో బరిలోకి దిగుతుందా? కీలక ప్లేయర్లకు రెస్టు ఇచ్చి.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తుందా అనేది చూడాల్సి ఉంది.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
సాధారణంగా ఒక టోర్నీ ప్రారంభం అయ్యేటప్పుడు విలేకరులతో కెప్టెన్లు మాట్లాడుతుంటారు. ప్రస్తుతం ఆసియా కప్ నడుస్తున్న నేపథ్యంలో అన్ని జట్లకు సంబంధించిన సారథులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కొక్కరు తమ గేమ్ ప్లాన్.. ఆటగాళ్ల వివరాలు.. జట్టు బలాలు, బలహీనతల గురించి వివరించారు. తమకు ఎదురైన ప్రశ్నలకు సరైన స్థాయిలో సమాధానాలు చెప్పారు. ఆటను ప్రమోట్ చేయడానికి.. ఆసియా కప్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపడుతూ ఉంటారు. ఇది సర్వ సాధారణమైన విషయం.
తగలబెడతారా ఏంది
విలేకర్ల సమావేశంలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడాడు. తమ జట్టు గేమ్ ప్లాన్.. ప్లేయర్ల వివరాలు.. ఇతర విషయాల గురించి వెల్లడించాడు. అయితే ఇటీవల దాయాది దేశంతో ఎదురైన పరిణామాలు.. ఉద్రిక్తత.. పాకిస్తాన్ జట్టుపై రూపొందించుకున్న గేమ్ ప్లాన్.. వీటి గురించి ఓ విలేఖరి సూర్యకుమార్ యాదవ్ ను ప్రశ్నించాడు. “పాకిస్తాన్ అంటే కచ్చితంగా మైదానంలో దూకుడు ఉంటుంది. ఆ దూకుడు మేము కొనసాగిస్తూనే ఉంటాం. అందులో ఏమాత్రం తగ్గం. వెనకడుగు వేయం. మైదానంలో ఆడుతున్నంత సేపు మాలో ఉత్సాహం అలానే ఉంటుంది. మ్యాచ్ అంటేనే తారస్థాయిలో అంచనాలు ఉంటాయి కాబట్టి.. వాటిని నిలుపుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటామని” సూర్య వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ ప్రారంభం కంటే ముందే సూర్య ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో టీమిండియా అనుకూల నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉందంటే 14న జరిగే మ్యాచ్ లో మైదానంలో పాకిస్తాన్ ను తగలబెడతారా ఏంటి అని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతున్నంత సేపు పాకిస్తాన్ కెప్టెన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. పైగా అతని ముఖంలో ఎటువంటి హావభావం కనిపించకపోవడం గమనార్హం.
️ We’ve had good preparations and time together as a team#TeamIndia captain Suryakumar Yadav talks about the importance of preparations ahead of #AsiaCup2025 @surya_14kumar pic.twitter.com/OsU5HWcLKI
— BCCI (@BCCI) September 9, 2025