Surya Kumar Yadav Comments On Shivam Dube: కొన్ని సందర్భాలలో మేనేజ్మెంట్ ను కాదని టీమ్ ఇండియా సారథులు నిర్ణయాలు తీసుకుంటారు. తమకు నచ్చిన ఆటగాళ్ల విషయంలో కాస్త ఉదారత చూపిస్తారు. అవకాశాలు కూడా కల్పిస్తారు. దీనికి ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మినహాయింపు కాదు. ప్రస్తుతం టీమిండియా దుబాయ్ లో ఉంది. ఆసియా కప్ కోసం సన్నద్ధమవుతోంది. రేపు హాంకాంగ్ తో టీమిండియా అబుదాబిలో తలపడుతుంది.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
హాంకాంగ్ చిన్న జట్టు అయినప్పటికీ టీమ్ ఇండియా ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. మైదానంలో తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. సూర్య కుమార్ యాదవ్ నుంచి మొదలు పెడితే రింకూ సింగ్ వరకు మైదానంలో సాధన చేశారు.. సంజు శాంసన్ కీపర్ అవతారం ఎత్తాడు. తిలక్ వర్మ, గిల్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో సూర్య సాధన చేశాడు. మధ్య మధ్యలో ఆటగాళ్లు కాస్త విశ్రాంతి తీసుకున్నారు. మైదానం మీద ఉన్న పచ్చికపై కాసేపు సేద తీరారు.
ప్రాక్టీస్ అనంతరం టీమిండియా శిక్షకుడు మోర్నీ మోర్కిల్ అంతర్గతంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో శివం దుబే గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు..” పొట్టి ఫార్మాట్లో ఆటగాళ్లు వేగంగా ఆడతారు. కాకపోతే బౌలర్లు ఎక్కువ బాధ్యత చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా నాలుగు ఓవర్లు కచ్చితత్వంతో వేసే బౌలర్ ఉండాలి. అతడు వేసే బంతులు ఆటను ప్రభావితం చేస్తాయి. ఇలా బౌలింగ్ వేసే వారిలో శివం ఒకడు” అంటూ మోర్కల్ పేర్కొన్నాడు. అయితే అతడు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. టి20 వరల్డ్ కప్ సమయంలోనే వారిద్దరికీ మంచి స్నేహం ఏర్పడిందని.. అది బలోపేతం అయిందని తెలుస్తోంది. అందువల్లే సూర్య కుమార్ యాదవ్ శివం దుబే మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అన్ని అనుకూలిస్తే శివం రిజర్వ్ బెంచ్ నుంచి బయటికి వస్తాడని.. తుది జట్టులో ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ఉట్టిదేనని.. ప్రతి ఆటగాడి మీద సూర్యకుమార్ యాదవ్ కు ఇదే స్థాయిలో ఆసక్తి ఉంటుందని.. దీనికి వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.