టీమ్ సౌథీ, మోర్గాన్ తో గొడవపై అశ్విన్ స్పందన

కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆ జట్టు ఆటగాడు టిమ్ సౌథీతో జరిగిన గొడవపై ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. తప్పొప్పుల గురించి మాట్లాడేటప్పుడు కాస్తా ఆలోచించాలని అన్నాడు. నిబంధనలకు లోబడి ఆడటం, మైదనం వీడిన తర్వాత గొడవల గురించి మర్చిపోవడం అసలైన క్రీడాస్ఫూర్తి అన్న విషయం పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాలని తల్లిదండ్రులకు సూచించాడు అశ్విన్. అమర్యాదకర పదాల్ని ఉపయోగించడం మానుకోవాల్సిందిగా కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ […]

Written By: Suresh, Updated On : October 1, 2021 10:03 am
Follow us on

కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆ జట్టు ఆటగాడు టిమ్ సౌథీతో జరిగిన గొడవపై ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. తప్పొప్పుల గురించి మాట్లాడేటప్పుడు కాస్తా ఆలోచించాలని అన్నాడు. నిబంధనలకు లోబడి ఆడటం, మైదనం వీడిన తర్వాత గొడవల గురించి మర్చిపోవడం అసలైన క్రీడాస్ఫూర్తి అన్న విషయం పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాలని తల్లిదండ్రులకు సూచించాడు అశ్విన్.

అమర్యాదకర పదాల్ని ఉపయోగించడం మానుకోవాల్సిందిగా కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బౌలర్ టిమ్ సౌథీలకు రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. మంగళవారం ఢిల్లీ, కోల్ కతా జట్ల మధ్య మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠి విసిరిన త్రో రిషబ్ పంత్ ను తాకి వెళ్తుండగా అశ్విన్ పరుగు కోసం ప్రయత్నించాడు. ఇలాంటి సందర్భంలో పరుగు తీయొచ్చని ఎంసీసీ నిబంధనల్లో ఉంది. అయితే అశ్విన్ చర్య సిగ్గుచేటని.. క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని మోర్గాన్ విమర్శించాడు. అశ్విన్ ఔటవగానే మోసం చేస్తే ఇలాగే జరుగుతుంది అని ధిల్లీ ఆటగాడిని ఉద్దేశిస్తూ సౌథీ వ్యాఖ్యానించాడు.

అనంతరం అశ్విన్ తో, సౌథీ, మోర్గాన్ వాగ్వాదానికి దిగారు. దినేశ్ కార్తీక్ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఈ వ్యవహారంపై అశ్విన్ స్పందించాడు. ఫీల్డర్ విసిరిన బంతి పంత్ ను తాకిందన్న సంగతి నాకు తెలియదు. ఆ సమయంలో పరుగు కోసం వెళ్తున్నా. పంత్ కు బంతి తాకిందని తెలిసినా నేనే పరుగు కోసం ప్రయత్నించేవాడిని. అందుకు నిబంధనలు అనుమతిస్తాయి అని అన్నాడు. మోర్గాన్ చెప్పినట్లు నాకు ఇతరులను గౌరవించడం రాదా? నా పాటికి నేను అక్కడ నిల్చుని ఉన్నాను. నా తల్లిదండ్రులు, టీచర్లు చెప్పినట్లు బుద్ధిగా నిల్చుని ఉన్నా. మీరు కూడా మీ పిల్లలకు ఇదే చెప్పండి అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. మోర్గాన్, సౌథీ వారి క్రికెట్ ప్రపంచంలో వారికి నచ్చిందే సరైందని భావించవచ్చు. కానీ మైదానంలో ఒకరిని తక్కువ చేసి మాట్లాడే హక్కు వారికి లేదు అని అన్నాడు.