Tollywood Stars: హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్ అంటే.. ఒకప్పుడు ఒక విలువ ఉండేది. గతంలో అసలు ప్రభుత్వ పెద్దలకు భయపడే వారు కాదు. కానీ ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెయిన్ గా జగన్ కి సినీ పెద్దలు అంతా సరెండర్ అయిపోయినట్లు కన్పిస్తోంది. ఎవరు ఏ స్టేజ్ మీద మాట్లాడినా.. తెలుగు సినీ పరిశ్రమ పై దయ చూపాలని జగన్ ను బతిమాలాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఒకపక్క జగన్ కనికరం చూపిస్తాడనే అంచనాలు లేవు.

అయినా సినీ పెద్దలు మాత్రం జగన్ ను రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున జగన్ మెప్పు కోసం విన్నవించుకున్నారు. ఇక స్టార్ నిర్మాత అల్లు అరవింద్ కూడా జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ.. ఇన్ డైరెక్ట్ గా థియేటర్స్ పై సినిమా టికెట్ రేట్లు విషయంలో దయ చూపాలి అన్న సెన్స్ లో అల్లు అరవింద్ స్పీచ్ సాగింది.
అరవింద్ మాటల్లోనే..“సినిమా పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. . కరోనా నుంచి ప్రజలను ఎలా రక్షించారో సినిమా పరిశ్రమను కూడా అలా రక్షించుకోవాలి. రాజు తలుచుకుంటే వరాలకు కరువా ?’ అంటూ అల్లు అరవింద్ మొత్తానికి జగన్ ను రాజుతో పోల్చాడు. మరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అల్లు అరవింద్ రిక్వెస్ట్ ను పట్టించుకుంటాడా ?
నిజానికి విడుదలయ్యే సినిమాలన్నీ టికెట్ రేట్లు పెరిగితే బాగుంటుంది అని ఆశ పడుతున్నాయి. రేట్లు పెరిగితే మిగిలిన పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధం అవుతాయి. మరి సినిమా పరిశ్రమ విజయవంతంగా కొనసాగాలి అంటే.. కచ్చితంగా ప్రభుత్వం సహకారం అవసరం. అందుకే అల్లు అరవింద్ కూడా జగన్ కి విజ్ఞప్తి చేశాడు.
టికెట్ రేట్ల పెంచుతారని, 100 శాతంతో థియేటర్లను నడుపుతారని, అలాగే రోజుకు నాలుగు ఆటలకు అనుమతి ఇస్తారని సినిమా వాళ్ళు ఆశ పడుతున్నారు. మరీ జగన్ ఏమి చేస్తాడో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం జగన్ మెప్పు కోసం స్టార్లు తిప్పలు పడుతున్నారు.