Ashwin: అశ్విన్ కూతుళ్లు మామూలు జీనియస్ కాదు.. వీడియో వైరల్

Ashwin: రవిచంద్రన్ అశ్విన్ క్యారం బాల్స్, దూస్రాలతో ప్రత్యర్థి బ్యాటర్లలో వణుకు పుట్టిస్తాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. వందల మ్యాచ్లలో టీం మీడియాకు విజయాలు అందించాడు. వన్డే, టీ 20, టెస్ట్ మ్యాచ్లో మెరిశాడు. భారతీయ టెస్ట్ క్రికెట్ ను కొన్ని సంవత్సరాలు పాటు శాసించాడు.

Written By: NARESH, Updated On : June 1, 2024 9:55 pm

Ashwin

Follow us on

Ashwin: రవిచంద్రన్ అశ్విన్.. అనిల్ కుంబ్లే తర్వాత ఆ స్థాయిలో టీమిండియాలో పేరు తెచ్చుకున్నాడు. అద్భుతమైన బౌలర్ గా ఖ్యాతి గడించాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్పిన్ బౌలింగ్ తో సుప్రసిద్ధ బౌలర్ గా అవతరించాడు. క్రికెటింగ్ టాక్టీస్ లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్ క్యారం బాల్స్, దూస్రాలతో ప్రత్యర్థి బ్యాటర్లలో వణుకు పుట్టిస్తాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. వందల మ్యాచ్లలో టీం మీడియాకు విజయాలు అందించాడు. వన్డే, టీ 20, టెస్ట్ మ్యాచ్లో మెరిశాడు. భారతీయ టెస్ట్ క్రికెట్ ను కొన్ని సంవత్సరాలు పాటు శాసించాడు. అయితే టీం ఇండియాలోకి కొత్త రక్తం రావడంతో అశ్విన్ టెస్ట్ క్రికెట్ కి పరిమితమయ్యాడు.. అయితే అలాంటి దిగ్గజ ఆటగాడి కూతుళ్లకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇతర బౌలర్లకు, రవిచంద్రన్ కు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అతడికి ఆటను అర్థం చేసుకోవడం, పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయడం, బ్యాటర్ల తీరును బట్టి వ్యూహాలు మార్చుకొని బంతులు వేయడం అతడికి అలవాటు. ఎంతటి బ్యాటర్ అయినప్పటికీ.. తన మెలికలు తిప్పే బంతులతో మాయ చేయగలడు. అతడి వ్యూహాలకు పెద్ద పెద్ద బ్యాటర్లు కూడా తికమక పడిన సందర్భాలున్నాయి. అలాంటి ఆటగాడి కూతుళ్లు కూడా అత్యంత జీనియస్ లు గా రూపాంతరం చెందారు. అశ్విన్ కూతుళ్లు అకిరా, ఆద్య అతన్ని మించిపోయారు. క్రికెట్ నాలెడ్జిలో ఔరా అనిపిస్తున్నారు. అకిరా, ఆద్య తో కలిసి రవిచంద్రన్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూ చేశాడు. దానిని తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ ఫీవర్ సాగుతోంది. ఇందులో భాగంగా అశ్విన్ తన కూతుళ్లకు క్విజ్ పెట్టాడు.. టి20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లు, వేదికలు, ఆటగాళ్లకు సంబంధించిన పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వాటికి అకిర, ఆద్య అత్యంత సులువుగా సమాధానాలు చెప్పారు.. ప్రపంచ కప్ ఎక్కడ నిర్వహిస్తారు అని అశ్విన్ అడిగితే అమెరికా – కరేబియన్ దీవులు అని సమాధానం చెప్పారు. వెస్టిండీస్ కెప్టెన్ ఎవరు అని అడిగితే రోమన్ పావెల్ అని ఆన్సర్ ఇచ్చారు. టీం ఇండియా కోచ్ ఎవరు అని అడిగితే.. రాహుల్ ద్రావిడ్ అని చెప్పారు.. ఇప్పటివరకు ఎన్ని టీ20 వరల్డ్ కప్ లు జరిగాయి అని అడిగితే.. 8 అని తడము కోకుండా సమాధానం చెప్పారు. అత్యంత కఠిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడంతో.. అశ్విన్ కూతుళ్లకు ఉన్న క్రికెట్ నాలెడ్జి పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.