https://oktelugu.com/

Ranbir Kapoor: మరో తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్న రన్బీర్ కపూర్..!

Ranbir Kapoor: ఇక ఆ భయాన్ని కప్పి పుచ్చుకోవడానికి వరుస సినిమాలను చేయడానికి అక్కడ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ సినిమా డైరెక్టర్ల పైన వాళ్ళు ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నారు. ఇక రన్బీర్ కపూర్ రీసెంట్ గా మన తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేసిన 'అనిమల్ ' సినిమా సూపర్ సక్సెస్ అయింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 1, 2024 / 09:04 PM IST

    Ranbir Kapoor

    Follow us on

    Ranbir Kapoor: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సక్సెస్ కొట్టడానికి విపరీతమైన కసరత్తులైతే చేస్తున్నారు. ఇక డిఫరెంట్ కథలను ఎంచుకొని ఎలాగైనా సరే పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని సాధించి తెలుగు హీరోలకు పోటీని ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రాబోయే ఆరు నెలల్లో తెలుగు సినిమాల హవా కొనసాగుతున్న క్రమంలో బాలీవుడ్ జనాలకి ఒకవైపు భయం పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే.
    ఇక ఆ భయాన్ని కప్పి పుచ్చుకోవడానికి వరుస సినిమాలను చేయడానికి అక్కడ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ సినిమా డైరెక్టర్ల పైన వాళ్ళు ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నారు. ఇక రన్బీర్ కపూర్ రీసెంట్ గా మన తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేసిన ‘అనిమల్ ‘ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతో ఇప్పుడు ఆయన మరోసారి సౌత్ సినిమా దర్శకుల పైనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే  ఆయన మరో తెలుగు దర్శకుడు తో సినిమా చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నాడు.
    ఇక ఇప్పుడు కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికి ఆ తర్వాత కూడా రన్బీర్ కపూర్ తెలుగు దర్శకుడితోనే మరొక సినిమా చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. ఇక దానికి సంబంధించిన కథ చర్చలను కూడా నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తెలుగు దర్శకుడు ఎవరు అనే విషయం లో క్లారిటీ లేనప్పటికీ ఆయన ప్రస్తుతం తెలుగు లో ఉన్న ఒక స్టార్ డైరెక్టర్ అనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది.
    ఇక స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ సినిమాని అనౌన్స్ చేసే పనిలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. అనిమల్ ఇచ్చిన సక్సెస్ తో రన్బీర్ కపూర్ ఇప్పుడప్పుడే తెలుగు సినిమా దర్శకులను వదిలేలా లేడు. ఇక చూడాలి మరి ఆయన తర్వాత చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…