Kalki 2898 AD: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్…ప్రస్తుతం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆయన కల్కి సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా పాల్గొంటున్నాడు. ఇక దానికి సంబంధించినట్టుగానే కల్కి సినిమాలో ఆయన వాహనంగా వాడే బుజ్జి అనే వెహికల్ కి సంబంధించిన ఒక సీరీస్ ని అలాగే “బుజ్జి అండ్ భైరవ” కి సంబంధించిన రిలేషన్ షిప్ ని తెలియజేస్తూ ఒక వీడియో అయితే క్రియేట్ చేశారు.
ఇక రీసెంట్ గా ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక దీని మీద ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. దాదాపు 3 కోట్లతో చేసిన ఈ ఆనిమేటెడ్ సిరీస్ ని చూడడానికి కూడా ఎవరు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో కల్కి సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గిపోయయా? అసలు ఈ సినిమా చూడడానికి అభిమానులు ఉత్సాహన్ని చూపిస్తున్నారా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ నెల 27 వ తేదీన రాబోతున్న ఈ సినిమా మీద ఏ మాత్రం ప్రేక్షకుల్లో బజ్ అయితే లేనట్టుగా కనిపిస్తుంది.
ఇక దానికి తగ్గట్టుగా అమెజాన్ ప్రైమ్ లో ఎంత వెతికినా కూడా ఈ వీడియో సరిగ్గా కనిపించడం లేదు. ఇక టాప్ లో పంచాయతీ సిరీస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఆ తర్వాత అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు కనిపిస్తుంది. ఈ రెండింటి తర్వాత మూడో ప్లేస్ లో “బుజ్జి అండ్ భైరవ” లా సీరీస్ కనిపించడం అనేది ఈ అనిమేటెడ్ సిరీస్ కి ఎలాంటి స్పందన దక్కుతుందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
కాబట్టి కల్కి సినిమా మీద బజ్ క్రియేట్ అవ్వాలంటే మాత్రం సినిమా యూనిట్ ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది అంటూ సినీ విమర్శకులు సైతం ఈ సినిమా యూనిట్ మీద పలు రకాల కమెంట్లైతే చేస్తున్నారు…