Duleep trophy 2024: అనంతపురంలో కలకలం.. మ్యాచ్ జరుగుతుండగా.. మైదానంలో ఒక్కసారిగా సంచలనం.. ఉలిక్కిపడ్డ ఆటగాళ్లు

అనంతపురం వేదికగా ప్రస్తుతం దులీప్ ట్రోఫీ జరుగుతోంది. ఇండియా సీ , ఇండియా డీ జట్లు తలపడుతున్నాయి. ఆర్టీటీ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. స్టార్ ఆటగాళ్లు ఆడుతున్న నేపథ్యంలో అభిమానులు భారీగా హాజరయ్యారు. అయితే ఆ మైదానంలో ఉన్నట్టుండి చోటుచేసుకున్న సంఘటన స్టేడియంలో కలకలాన్ని రేపింది. దీంతో ఆటగాళ్లు కూడా ఒకసారిగా ఆందోళన చెందారు.

Written By: NARESH, Updated On : September 6, 2024 6:22 pm

Duleep trophy 2024

Follow us on

Duleep trophy 2024 : ఇండియా సీ, డీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ నేపథ్యంలో.. ఓ అభిమాని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సెక్యూరిటీ కళ్లు గప్పి అతడు ఈ పని చేశాడు. మైదానంలోకి వచ్చిన ఆ అభిమాని మిడ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా ఓపెనర్, భారత సీ జట్టు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ వద్దకు వెళ్లాడు. అతడి పాదాలకు నమస్కరించాడు. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం ప్రపంచాన్ని రెట్టించిన ఉత్సాహంతో వెనక్కి మళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. అయితే ఈ ఘటనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవాళీ టోర్నీ లో భద్రతను పటిష్టంగా అమలు చేయరా? అంటూ బీసీసీఐ అధికారులు మండి పడినట్టు తెలుస్తోంది. పోలీసులు భద్రత కల్పించడం లేదా? అంటూ వారు అధికారులను నిలదీసినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీ మొత్తం అనంతపురంలోనే జరగనుంది. టోర్నీ మొదలైన రెండవ రోజే ఇలాంటి భద్రతాపరమైన లోపం తలెత్తిన నేపథ్యంలో బీసీసీఐ అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు ఆడుతున్న సమయంలో ఇలా అభిమానులు మైదానంలోకి వస్తే.. వారు ఒక్కసారిగా తమ అటెన్షన్ కోల్పోతారని బీసీసీఐ అధికారులు అంటున్నారు. స్థానిక పోలీస్ అధికారులు భద్రతను కట్టుదిట్టంగా అమలు చేయాలని.. ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా చూ సుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది..

ఇక రుతు రాజ్ గైక్వాడ్ ధోనికి అత్యంత ప్రియమైన శిష్యుడు. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున అతను ఆడుతున్నాడు.. మూడు సంవత్సరాలుగా ఐపీఎల్లో అతడు అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అవకాశాలు లభించినప్పటికీ అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో రుతు రాజ్ ఆధ్వర్యంలోని ఇండియా – సీ జట్టుకు నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 91/4 ఓవర్ నైట్ స్కోర్ తో ఇండియా – సీ జట్టు రెండవ రోజు ఆటను మొదలుపెట్టింది. 168 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఆ జట్టులో బాబా ఇంద్రజిత్తు 72, అభిషేక్ 34 పరుగులతో టాప్ స్కోరర్ లు గా నిలిచారు. ఇండియా – డీ జట్టులో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, జైన్ తల రెండు వికెట్లు దక్కించుకున్నారు. అర్ష్ దీప్ సింగ్, ఆదిత్య ఠాక్రే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.