https://oktelugu.com/

Ben Stokes On Ashes: బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ కు ‘యాషెస్’ తీసుకొస్తాడా? సారథ్యం హిట్ అయ్యేనా..?

గత కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా యాసెస్ పేరుతో టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్ విజయమే లక్ష్యంగా ఇరు జట్లు సర్వశక్తులను ఒడ్డుతాయి. ఈ ఏడాది కూడా టెస్ట్ సిరీస్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది

Written By:
  • BS
  • , Updated On : June 2, 2023 / 11:12 AM IST

    Ben Stokes On Ashes

    Follow us on

    Ben Stokes On Ashes: ప్రతిష్టాత్మకమైన యాసెస్ సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆసక్తిగా చూసేలా చేస్తుంది. ఇరు జట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వలన ఈ టోర్నమెంట్ గత కొన్నేళ్లుగా ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ తో సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే యాసెస్ ఆడనుంది ఇంగ్లాండ్ జట్టు. ఈ సీరీస్ నేపథ్యంలో బెన్ స్టోక్స్ ఓ ఛానెల్ తో పలు విషయాలపై మాట్లాడారు.

    గత కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా యాసెస్ పేరుతో టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్ విజయమే లక్ష్యంగా ఇరు జట్లు సర్వశక్తులను ఒడ్డుతాయి. ఈ ఏడాది కూడా టెస్ట్ సిరీస్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇంగ్లాండ్ జట్టు బెన్ స్టోక్ సారధ్యంలో యాసెస్ ఆడబోతోంది. ఈ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ గురించి మాట్లాడిన బెన్ స్టోక్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. 2019, 2020 మాదిరిగానే ప్రస్తుతం ఫామ్ లోకి వచ్చినట్లు స్టోక్ పేర్కొన్నాడు.

    పూర్తి ఫిట్ నెస్ తో సిరీస్ కు సిద్ధంగా..

    ప్రతిష్టాత్మకమైన యాసెస్ సిరీస్ కు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు బెన్ స్టోక్ వెల్లడించాడు. నాటి అత్యుత్తమ ఫామ్ లోకి ప్రస్తుతం వచ్చినట్లు వివరించాడు. గతంలో ఆస్ట్రేలియా చివరి సారిగా యాషెస్ ఆడేందుకు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు అద్భుతమైన ఫామ్ లో స్టోక్స్ ఉన్నాడు. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆల్రౌండర్ రాణిస్తున్నాడు. బజ్బాల్ మంత్రాన్ని ఉపయోగించి ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు స్టోక్ నేతృత్వంలోని 12 టెస్టుల్లో పది టెస్టుల్లో విజయం సాధించి ముందుకు సాగుతోంది.

    బంతి, బ్యాట్ తో రాణించగల సామర్థ్యం స్టోక్ సొంతం..

    ఇంగ్లాండ్ జట్టులో అత్యుత్తమ ఆల్రౌండర్ గా పేరుగాంచిన బెన్ స్టోక్ రానున్న యాసెస్ సిరీస్ లో ఆల్ రౌండర్ గా రాణిస్తానని భావిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లోను మెరుగ్గానే రాణించాడు. బ్యాట్ తో జట్టుకు అమూల్యమైన పరుగులు చేయడంతోపాటు అవసరమైన సమయంలో బౌలింగ్ వేసి ప్రత్యర్థికి ముకుతాడు వేయగల సామర్థ్యం స్టోక్స్ సొంతం. ఇంగ్లాండ్ కెప్టెన్ గా, ఫిట్నెస్ పరంగా ఫామ్ లోకి వచ్చినట్లు స్టోక్స్ చెబుతున్నాడు. ‘తాను వెనక్కి తిరిగి చూసుకోలేని, భయపడాల్సిన పరిస్థితి లేని స్థితికి చేరుకున్నాను’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. 2019, 2020 సీజన్ లో అత్యుత్తమ ఫామ్ కొనసాగించాలని ప్రస్తుతం ఆ స్థితికి చేరుకున్నట్లు భావిస్తున్నానని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

    అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకొని..

    కచ్చితంగా నాకు అత్యుత్తమ అవకాశాలు వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటానని స్టోక్స్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కొత్త మంత్రం బజ్ బాల్ క్రికెట్ ప్రపంచంలోనే ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఈ పద్ధతిని ఎంతకాలం కొనసాగించగలదని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
    యాసెస్ కారణంగా పెరిగిన ఒత్తిడితో సంబంధం లేకుండా తాము అదే పద్ధతిలో ఆటను కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. తాము ఎల్లప్పుడూ జట్టు కోసం గొప్పగా ఆడాలని ప్రయత్నిస్తామని, అందుకు అనుగుణంగానే తమ ప్రయత్నాలు ఉంటాయని స్పష్టం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు అద్భుతమైన విజయాలు సాధించడం సాధ్యమవుతుందని స్టోక్స్ వివరించాడు.