https://oktelugu.com/

Aravelli Avanish Rao: కేటీఆర్ ట్వీట్ తో వెలుగులోకి అవనీష్ రావు…అసలు ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?

అవనీష్ రావు కి అవకాశం రావడం అలాగే తను తెలంగాణ రాష్ట్రం లోని సిరిసిల్ల జిల్లాకి చెందిన అబ్బాయి కావడంతో సిరిసిల్ల మాజీ మంత్రి ప్రస్తుత ఏమెల్యే కేటీఆర్ అవనీష్ రావుకి ట్విట్టర్ లో తన కంగ్రాచ్యులేషన్స్ ని తెలియజేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 16, 2023 / 12:52 PM IST

    Aravelli Avanish Rao

    Follow us on

    Aravelli Avanish Rao: క్రికెట్ అంటే ఇండియా లో ప్రాణం పోయేంత ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే బ్యాట్ పట్టుకొని చాలా సంవత్సరాల పాటు గ్రౌండ్ లోనే కాలం గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు…కానీ చాలా మంది కి అవకాశాలు రాకుండానే క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన అరవెల్లి అవనీష్ రావు అనే ఒక క్రికెట్ ప్లేయర్ అండర్ 19 వరల్డ్ కప్ కి సెలక్ట్ కావడం అనేది నిజంగా అభినందనీయం తెలంగాణలో కూడా చాలామంది క్రికెట్ అంటే పడి చచ్చిపోతుంటారు. అందులో భాగంగానే చాలామందికి అవకాశాలు రానప్పటికీ అవకాశం వచ్చిన వాళ్ళు మాత్రం ఇలా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

    ఇక అవనీష్ రావు కి అవకాశం రావడం అలాగే తను తెలంగాణ రాష్ట్రం లోని సిరిసిల్ల జిల్లాకి చెందిన అబ్బాయి కావడంతో సిరిసిల్ల మాజీ మంత్రి ప్రస్తుత ఏమెల్యే కేటీఆర్ అవనీష్ రావుకి ట్విట్టర్ లో తన కంగ్రాచ్యులేషన్స్ ని తెలియజేశారు.ఇక కేటీఆర్ ట్విట్ చేయడంతో అసలు ఈ అవనీష్ రావు ఎవరు అనేదానిమీద చాలామంది సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే అవనీష్ రావు ఎవరు అనేది ఒకసారి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం లోని పోత్గల్ గ్రామానికి చెందిన అవనీష్ రావు వెలుమ సామాజిక వర్గానికి చెందినవాడు.అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా బిజినెస్ లు, పాలిటిక్స్ లలో ప్రాధాన్యతను వహిస్తూ ఉంటారు. కానీ అవనీష్ రావు మాత్రం క్రికెట్ మీద ఆసక్తితో క్రికెట్ అంటే ప్రాణం పెట్టి ఆడడంతో తనకి అండర్ 19 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం వచ్చింది. ఇక వచ్చే సంవత్సరం దక్షిణాఫ్రికా వేదిక గా జరగబోయే ఈ టోర్నీలో భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇక ఈ జట్టుకు అండర్‌ 19 ఆసియాకప్‌ లో కెప్టెన్ గా భాద్యతలను స్వీకరించిన ఉదయ్‌ సహరన్‌ కే వరల్డ్ కప్‌లో కూడా కెప్టెన్సీ భాద్యతలను అప్పజెప్పింది.

    మొత్తం 15 మంది ఆటగాళ్ల తో అండర్‌ 19 ఆసియాకప్‌‌ లో ఆడిన ప్లేయర్స్ కే అవకాశం ఇచ్చారు. అర్షిన్ కులకర్ణి, రుద్ర మయూర్‌ పటేల్‌, ఆదర్శ సింగ్‌, సచిన్‌ దాస్‌ లను స్పెషల్ బ్యాటింగ్ కోసం తీసుకున్నారు.ఇక వికెట్ కీపర్ గా అవనీష్ రావు ని తీసుకున్నారు…ఇక తెలంగాణ ప్రాంతం నుంచి ఒక ప్లేయర్ అది కూడా సిరిసిల్ల నుంచి సెలెక్ట్ అవ్వడం తో ఆ ఊరి ప్రజలు అందరు అవనీష్ రావు వాళ్ల అమ్మ నాన్నల పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నాడు…ఇక అవనీష్ రావు ఫ్యూచర్ లో ఇంటర్నేషనల్ టీమ్ కి కూడా ఆడాలని చాలా మంది కోరుకుంటున్నారు… ఆయన్ని చూసి ఇంకా చాలా మందితెలుగు ప్లేయర్లు క్రికెట్ ఆడటానికి ఇంట్రెస్ట్ చూపించాలని కూడా భావిస్తున్నారు…