https://oktelugu.com/

Anushka Sharma: క్వీన్ ఆఫ్ క్రికెట్, క్వీన్ ఆఫ్ విరాట్.. దెబ్బకు చిన్నస్వామి స్టేడియం షేక్.. వైరల్ ఫోటో

శనివారం రాత్రి బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తల పడ్డాయి. నువ్వా, నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్లో బెంగళూరు విజయాన్ని సాధించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 19, 2024 1:19 pm
    Anushka Sharma

    Anushka Sharma

    Follow us on

    Anushka Sharma: వరుస విజయాలతో బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్ళింది.. కీలకమైన మ్యాచ్ లో చెన్నై జట్టుపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బెంగళూరు జట్టు ఆటగాళ్లు, అభిమానుల్లో ఆనందం తాండవం చేస్తోంది. నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా బెంగళూరు మేనియాతో ఊగిపోతోంది. అయితే ఇందులో ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియానే కాదు ఇంటర్నెట్ ను కూడా షేక్ చేస్తోంది. ఆ ఫోటోలో ఉన్నది ఇద్దరు మహిళలు. ఇంతకీ ఎవరు వారు? వారి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఇంటర్నెట్ ఊగిపోతోంది.. ఆ విశేషాలేమిటో మీరూ చదివేయండి.

    శనివారం రాత్రి బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తల పడ్డాయి. నువ్వా, నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్లో బెంగళూరు విజయాన్ని సాధించింది. చెన్నై టాస్ గెలిచినప్పటికీ బెంగళూరును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో ముందుగా బెంగళూరు బ్యాటింగ్ చేసి 218 రన్స్ చేసింది. కెప్టెన్ డూ ప్లెసిస్ 54, విరాట్ కోహ్లీ 47, రజత్ పాటిదార్ 41, గ్రీన్ 38 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2, మిచెల్ శాంట్నర్, తుషార్ దేశ్ పాండే చెరొక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం టార్గెట్ చేజ్ చేసేందుకు రంగంలోకి దిగిన చెన్నై జట్టు 191 రన్స్ మాత్రమే చేసింది. 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.. ఓపెనర్ రుతు రాజ్ గైక్వాడ్ డక్ ఔట్ అయ్యాడు. డారిల్ మిచెల్ నాలుగు పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడిన చెన్నై జట్టును అజింక్య రహనే, రచిన్ రవీంద్ర ఆదుకునే ప్రయత్నం చేశారు. కీలక సమయంలో వీరిద్దరూ అవుట్ కావడంతో.. చెన్నై జట్టుకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివం దూబే క్యాచ్ అవుట్, రచిన్ రవీంద్ర రన్ అవుట్ కావడం చెన్నై జుట్టు విజయవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ధోని, రవీంద్ర జడేజా దూకుడుగా ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో బెంగళూరు జట్టు దర్జాగా ప్లే ఆఫ్ వెళ్లిపోయింది.

    అయితే ఈ మ్యాచ్ చూసేందుకు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ, వుమెన్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మందాన హాజరయ్యారు. వీరు బెంగళూరు జట్టు ఆటగాళ్లకు సపోర్ట్ చేశారు.. అనుష్క శర్మ, స్మృతి నలుపు రంగు దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. వీరిని కెమెరామెన్ పదేపదే చూపించడంతో.. ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. బెంగళూరు జట్టు వికెట్లు తీసినప్పుడల్లా అనుష్క శర్మ, స్మృతి మందాన చప్పట్లు కొట్టి అభినందించారు. అంతకుముందు బెంగళూరు ఆటగాళ్లు బ్యాటింగ్ చేసినప్పుడు ఉత్సాహపరిచారు. బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీకి అనుష్క సతీమణి కావడంతో ఆమెను కన్నడ అభిమానులు ఓన్ చేసుకున్నారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టుకు స్మృతి మందాన నాయకత్వం వహించడం.. ఇటీవలి సీజన్లో విజేతగా ఆవిర్భవించడంతో ఆమెను ఆరాధించే కన్నడ అభిమానులు పెరిగిపోయారు. శనివారం వీరిద్దరూ స్టాండ్స్ లో కనిపించడంతో ఆడియన్స్ ఎగిరి గంతేశారు.

    ఇక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి. వాస్తవానికి అనుష్క శర్మ స్టాండ్స్ లో కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల తరచూ బెంగళూరు ఆడే మ్యాచ్ లకు అనుష్క శర్మ హాజరవుతోంది. విరాట్ కోహ్లీ ఫోర్లు, సిక్స్ లు కొడుతున్నప్పుడు ఎగిరి గంతేస్తోంది. ఇక ఈనెల ప్రారంభంలో విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మ 36 జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక విరాట్, అనుష్క 2017 డిసెంబర్ 11న వివాహం చేసుకున్నారు. వీరికి వామిక, అకాయ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.