https://oktelugu.com/

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రవి కిరణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో…

విజయ్ రవి కిరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్వీర్ సింగ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : May 19, 2024 / 01:38 PM IST

    Vijay Deverakonda

    Follow us on

    Vijay Deverakonda: ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలను లైన్ లో పెట్టి ప్రేక్షకులందరికీ షాక్ ఇస్తున్నాడు. ఇక గత రెండు సినిమాలైన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఆయన ఇప్పుడు విజయమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈయన సినిమాల్లో ముఖ్యంగా కొన్ని ఎలిమెంట్స్ అయితే కామన్ గా కనిపిస్తూ ఉంటాయి.

    అయితే ఈయన ఎక్కువగా లవ్ స్టోరీస్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం భారీ యాక్షన్ సినిమాలను తీయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మీదట నుంచి చాలా డిఫరెంట్ పాత్రలు చేయడానికి తను సిద్ధంగా ఉన్నాననే సంకేతాన్ని ప్రతి ఒక్క డైరెక్టర్ కి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు రవికిరణ్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో చేయబోయే సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక ఇలా వరుసగా వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

    ఇక ఇప్పుడు విజయ్ రవి కిరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్వీర్ సింగ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. కాబట్టి రన్వీర్ సింగ్ ను ఈ సినిమాలో భాగం చేయాలని రవికిరణ్ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించి తన పేరుని మరోసారి ఇండస్ట్రీలో మారుమ్రోగి పోయేలా చేయాలనుకుంటున్నాడు. మరి దీనికి అనుకూలంగానే విజయ్ దేవరకొండ కూడా చాలా వరకు కష్టపడుతూ తనను తాను మరోసారి ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

    ఇక విజయ్ దేవరకొండ, రవికిరణ్ ఇద్దరికీ ఈ సినిమా చాలా కీలకంగా మారబోతుంది. చూడాలి మరి ఈ సినిమాతో ఇద్దరు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది…ఇక ఫ్యామిలీ స్టార్ ప్లాప్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి దిల్ రాజు బ్యానర్లోనే ఈ సినిమా చేయడం విశేషం…