RCB vs CSK : ప్లేఆఫ్ లోకి చేరిన సంతోషంలో ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు.. కోహ్లీ ఆనందభాష్పాలు.. ధోని కన్నీళ్లు.. వైరల్ వీడియో…

ఇక ఇదిలా ఉంటే ధోని రిటైర్ అయిన తర్వాత అడబోయే సీజన్లలో చెన్నై టీమ్ ను వీళ్లంతా దగ్గరుండి ముందుకు తీసుకెళ్లగలరా లేదా అనే అనుమానాలు కూడా చెన్నై అభిమానుల్లో కలుగుతున్నాయి...

Written By: NARESH, Updated On : May 19, 2024 1:19 pm

Virat Kohli's joy after entering the playoffs.. MS Dhoni's tears

Follow us on

RCB vs CSK : ఐపీఎల్ సీజన్ 17 చివరి దశకు చేరుకుంది. ఇక సెమీస్ కి వెళ్లే నాలుగు టీమ్ లు కన్ఫర్మ్ అయ్యాయి. ఇవాళ్ళ ఆడే మ్యాచ్ లతో ప్లే ఆఫ్ లో ఏ టీమ్ ఏ ప్లేస్ లో నిలవబోతుంది అనే దాని మీద క్లారిటీ అయితే రానుంది. ఇక ఇదిలా ఉంటే నిన్న బెంగళూరు వర్సెస్ చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు ఘన విజయం సాధించింది. బెంగళూరు బ్యాట్స్ మెన్స్ లలో కోహ్లీ, గ్రీన్, డూప్లెసిస్ లాంటి ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ చేయగా, బౌలర్లు కూడా చెన్నై టీం బ్యాట్స్ మెన్లకు చెమటలు పట్టించేలా బౌలింగ్ వేసి మొత్తానికైతే ఈ మ్యాచ్ ను విజయ తీరాలకు చేర్చారు.

ఇక చివరి ఓవర్ వేసిన యశ్ దయాల్ ను మనం మెచ్చుకోకుండా ఉండలేం…ధోని లాంటి ఒక దిగ్గజ ఆటగాడు క్రీజ్ లో ఉండి మొదటి బంతి కి సిక్స్ వచ్చిన కూడా తను ఏమాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా అద్భుతమైన స్పెల్ వేసి బెంగళూరు టీమ్ ని ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యేలా చేశాడు. ఇక మొత్తానికైతే బెంగళూరు సాధించిన ఈ విజయంలో ఆయన కీలక పాత్ర వహించడనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగుళూరు ప్లేయర్స్ చేసుకున్న సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. ఫైనల్లో కప్పు గెలిచిన టీమ్ ఎలాంటి సంబరాలు చేసుకుంటారో దానికి ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళు సంబరాలు చేసుకోవడం అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కోహ్లీ మాత్రం గట్టిగా అరుస్తూ తన అగ్రెసివ్ నెస్ ని చూపిస్తూనే ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యాం అనే ఒక ఆనందం కూడా తన అరుపులో మనకు కనిపించింది. ఇక చివరి ఓవర్ వేసిన యశ్ దయాల్ అయితే గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ప్లేయర్లందరితో కలిసి ఆర్సిబి ని ప్లే ఆఫ్ కి చేర్చడంలో తను సక్సెస్ అయ్యాను అనే ఒక గర్వంతో ఆయన సెలబ్రేషన్ అయితే చేసుకున్నాడు.

ఇక దయాల్ చివరి ఓవర్ చివరి బంతి వేసినపుడు డూప్లెసిస్ బౌండరీ లైన్ దగ్గర ఉన్నాడు. ఆ బాల్ మిస్ అవ్వడంతో తను గట్టిగా అరుస్తూ పరుగెత్తుకుంటూ వెళ్ళి దయాల్ ను పట్టుకున్నాడు. ఇక మొత్తానికైతే బెంగళూరు టీమ్ భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇక కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయిన చెన్నై టీమ్ మాత్రం అనుకోని రీతిలో ఓడిపోవడం అనేది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ధోని కి ఇది చివరి సీజన్ అవుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీగా తెలియనప్పటికీ ఈ సీజన్ లో చెన్నై టీమ్ కూడా ప్లే ఆఫ్ కి చేరుకుంటే బాగుండేది. అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. గత సంవత్సరం ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై ఇప్పుడు ప్లే ఆఫ్ కి రాకుండానే లీగ్ దశలోనే వెనుతిరగడం అనేది ఒక రకంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.

రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కి చేరుకోలేకపోయిందనేది చెన్నై టీం అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఇక మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లో కోహ్లీ ఆనంద భాష్పాలను కారుస్తుంటే, ధోని మాత్రం గెలవాల్సిన మ్యాచ్ ను చేజర్చుకున్నందుకు కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కలిచివేసింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఇక ఇదిలా ఉంటే ధోని రిటైర్ అయిన తర్వాత అడబోయే సీజన్లలో చెన్నై టీమ్ ను వీళ్లంతా దగ్గరుండి ముందుకు తీసుకెళ్లగలరా లేదా అనే అనుమానాలు కూడా చెన్నై అభిమానుల్లో కలుగుతున్నాయి…