https://oktelugu.com/

Virat Kohli Vamika: విరాట్ కోహ్లీ కూతురు ఫస్ట్ ఫొటో లీక్.. వైరల్.. ఎవరి పోలికో తెలుసా?

Virat Kohli Vamika: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు ఫొటో లీక్ అయ్యింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ హాఫ్ సెంచరీ చేశాక అనుష్క పెవిలియన్ లో తన కూతురుతో కలిసి తండ్రి విషెస్ చెప్పడం కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఇన్నాళ్లుగా తమ కూతురు ముఖాన్ని దాచేసిన విరాట్ -అనుష్కలు అన్యాపదంగానే తమ కూతురు ఫొటోను ఇలా బయటపెట్టేశారు. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో విరాట్ కోహ్లీ (65) హాఫ్ సెంచరీ చేయగానే బ్యాటింగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2022 / 02:18 PM IST
    Follow us on

    Virat Kohli Vamika: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు ఫొటో లీక్ అయ్యింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ హాఫ్ సెంచరీ చేశాక అనుష్క పెవిలియన్ లో తన కూతురుతో కలిసి తండ్రి విషెస్ చెప్పడం కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఇన్నాళ్లుగా తమ కూతురు ముఖాన్ని దాచేసిన విరాట్ -అనుష్కలు అన్యాపదంగానే తమ కూతురు ఫొటోను ఇలా బయటపెట్టేశారు.

    సౌతాఫ్రికాతో మూడో వన్డేలో విరాట్ కోహ్లీ (65) హాఫ్ సెంచరీ చేయగానే బ్యాటింగ్ గ్యాలరీలో కూర్చొని ఉన్న అనుష్క శర్మ, వామిక వీక్షిస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే కోహ్లీ అర్థశతకం కాగానే వెలుపలికి వచ్చిన అనుష్క శర్మ, కూతురుకు మైదానంలోని కోహ్లీని చూపిస్తూ కనిపించింది. అదే సమయంలో వీడియోలు దీన్ని క్లిక్ మనిపించాయి. దీంతో వామికను క్రికెట్ ప్రపంచం తొలిసారి చూసినట్టైంది.

    2021 , జనవరి 11న వామిక జన్మించింది. ఇప్పటివరకూ ఆమె ఫొటోలను ప్రపంచానికి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ చూపించలేదు. పాప ప్రైవసీని గౌరవించాలని.. ఆమె ఫొటోలు తీయవద్దని విరుష్క జోడి మీడియాకు విజ్ఞప్తి చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు కూడా విమానాశ్రయంలో కూడా కొందరు ఫొటోలు తీయగా.. వాటిని డిలీట్ చేయాలని కోహ్లీ సూచించాడు.

    ఇక ఈ ఏడాది జనవరి 11న వామిక పుట్టినరోజు జరిగినా ఫొటోలు బయటకు రిలీజ్ చేయలేదు. వామికా ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకూ మూడు టెస్టుల సిరీస్ ను 1-2తో చేజార్చుకుంది. ఇక మూడు వన్డేల సిరీస్ ను చేజార్చుకుంది. ఆదివారంతో దక్షిణాఫ్రికా గడ్డపై భారత పర్యటన ముగియనుంది.

    https://twitter.com/shanthansaka/status/1485266233763446792?s=20