మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు

  ధోనీ.. ఒకప్పటి ఇండియా క్రికెట్‌ టీమ్‌కు కెప్టెన్‌. చిన్న ఏజ్‌లోనే కెప్టెన్‌ అయి ఇండియా ఎన్నో విజయాలు సాధించి పెట్టిన గ్రేట్‌ కెప్టెన్‌. వరల్డ్‌ కప్‌, ఒక టీ20 వరల్డ్‌ కప్‌.. ఇంకెన్నో ఛాంపియన్‌షిప్‌లు సాధించిపెట్టాడు. ధోనీ బ్యాంటింగ్‌కు దిగాడంటే అపోజిట్‌ టీంకు హడలే. అతని సిక్సర్లు అలా ఉంటాయి మరి. ఇప్పటికే సిక్సర్ల మోతతో ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకంగా గూడు కట్టుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. ఇన్ని […]

Written By: NARESH, Updated On : October 11, 2020 12:14 pm
Follow us on

 

ధోనీ.. ఒకప్పటి ఇండియా క్రికెట్‌ టీమ్‌కు కెప్టెన్‌. చిన్న ఏజ్‌లోనే కెప్టెన్‌ అయి ఇండియా ఎన్నో విజయాలు సాధించి పెట్టిన గ్రేట్‌ కెప్టెన్‌. వరల్డ్‌ కప్‌, ఒక టీ20 వరల్డ్‌ కప్‌.. ఇంకెన్నో ఛాంపియన్‌షిప్‌లు సాధించిపెట్టాడు.

ధోనీ బ్యాంటింగ్‌కు దిగాడంటే అపోజిట్‌ టీంకు హడలే. అతని సిక్సర్లు అలా ఉంటాయి మరి. ఇప్పటికే సిక్సర్ల మోతతో ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకంగా గూడు కట్టుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. ఇన్ని మైలురాళ్లు దాటిన ధోనీ మరో మైలురాయిని అందుకున్నాడు. తన ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది.

Also Read: ఐపీఎల్‌లో ఢిల్లీ జోరు.. టాప్‌ ప్లేస్‌ సాధించిన జట్టు

శనివారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. యుజ్వేంద్ర చాహల్‌ వేసిన 16వ ఓవర్‌‌ మూడో బంతిని ధోనీ లాంగ్‌ ఆన్‌ మీదుగా సిక్సర్‌‌ బాదాడు. ఆ సిక్సర్‌‌తో మహీ 300 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. దీంతో టీ 20 క్రికెట్‌లో 300 సిక్సర్లు బాదిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ధోనీ కంటే ముందు ముంబయి కెప్టెన్‌ రోహిత్‌శర్మ (375), చెన్నై ఆటగాడు చెన్నై టీం ఆటగాడు సురేశ్‌ రైనా (311) ఈ జాబితాలో ఉన్నారు. అయితే.. ధోనీ బీసీసీఐ నిర్వహించే టీ20 లీగ్‌లోనే 214 సిక్సర్లు బాదాడు. భారత జట్టు తరఫున కేవలం 52 మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ మొత్తం 323 టీ20లు ఆడిన ధోనీ 40.01 సగటుతో 6,723 పరుగులు చేశాడు. 27 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేట్‌ 135.1గా ఉంది.

Also Read: ఐపీఎల్ లో ఆ జట్టు కథ ముగిసినట్టేనా?

అయితే.. టీ20ల్లో అందరికంటే ఎక్కువ సిక్సర్లు బాదిన రికార్డు మాత్రం విండీస్‌ వీరుడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. 978 మ్యాచ్‌లు ఆడిన గేల్‌ 404 సిక్సర్లు బాదాడు. టీ20 లీగ్‌లోనూ గేల్‌దే హవా నడుస్తోంది. అతను 125 మ్యాచుల్లోనే 326 సిక్సర్లు వేశాడు. గేల్‌ తర్వాత డివిలియర్స్‌, ధోనీ, రోహిత్‌ శర్మ, విరాట్‌కోహ్లీ, సురేశ్‌ రైనా ఉన్నారు.