https://oktelugu.com/

గోవాలో నిహారిక బ్యాచిలర్ పార్టీ.. చూసి తీరాల్సిందే..!

మెగా డాటర్ నిహారిక త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతుంది. ఇప్పటికే ఆమెకు చైతన్య జొన్నలగడ్డతో నిశ్చితార్థం జరిగిపోయింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు.. సన్నిహితుల నడుమ వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కచోట చేరి సందడి చేసింది. అయితే పెళ్లి వేడుకపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. Also Read: దిశ’ మూవీ కూడా ‘మర్డర్’ అవుతుందా? నిహారిక త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ గుడ్ బై చెప్పబోతుంది. దీంతో తన స్నేహితులతో కలిసి గోవాకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2020 / 12:18 PM IST
    Follow us on

    మెగా డాటర్ నిహారిక త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతుంది. ఇప్పటికే ఆమెకు చైతన్య జొన్నలగడ్డతో నిశ్చితార్థం జరిగిపోయింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు.. సన్నిహితుల నడుమ వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కచోట చేరి సందడి చేసింది. అయితే పెళ్లి వేడుకపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

    Also Read: దిశ’ మూవీ కూడా ‘మర్డర్’ అవుతుందా?

    నిహారిక త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ గుడ్ బై చెప్పబోతుంది. దీంతో తన స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడి బీచుల్లో స్నేహితులతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలను.. ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

    లాక్డౌన్ సమయంలో మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ అభిమానులను అలరించింది. లైవ్లోలో అభిమానులతో మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటుంది. పెళ్లి విషయం కూడా సోషల్ మీడియా ద్వారానే నిహారిక ప్రకటించింది.

    అయితే పెళ్లాయిన తర్వాత సినిమాల్లో నటిస్తారా? అని ఓ అభిమాని ప్రశ్నించగా ‘నేనమన్న సమంతనా?’ అంటూ హాట్ కామెంట్ చేసింది. దీంతో ఆమె పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందో లేదో క్లారిటీ రావడం లేదు.

    నిహారిక షార్ట్ ఫిలీమ్స్.. బుల్లితెరపై యాంకరింగ్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో సంప్రదాయంగా కన్పించిన ఈ భామ బయట మాత్రం మాడ్రన్ గా కన్పిస్తూ అలరిస్తూ ఉంటోంది. ఇక నిహారిక పెళ్లిని మెగాస్టార్ చిరంజీవి ఖాయం చేసినట్లు తెలుస్తోంది.

    Also Read: ఇప్పుడెలా? మహేష్ బాబు ప్లాన్ బెడిసికొట్టిందా?

    తన తండ్రి స్నేహితుడైన ప్రభాకర్ రావు కుమారుడితో విహహానికి ఆయన చొరవచూపినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ ప్రస్తుతం గుంటూరు ఐజీగా పని చేస్తున్నారు. కాగా చైతన్య జొన్నలగడ్డకు  హైదరాబాద్లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందని సమాచారం. నిహారిక చివరగా ‘సైరా’ సినిమాలో చిన్న రోల్ చేసి అలరించింది.