చైనాలో పుట్టిన మహమ్మారి.. ఎట్టకేలకు ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని కూడా కాటేసింది. అసలే 74 ఏళ్లు ఉన్న ట్రంప్ కు ఈ వైరస్ చాలా డేంజర్ అని.. ఆయన ఆరోగ్యంపై అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆస్పత్రిలో కూడా ట్రంప్ చేరారు.. కానీ మొత్తానికి నాలుగు రోజులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడం సంచలనమైంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రంప్ తిరిగి వైట్ హౌస్ కు వచ్చి ఉత్సాహంగా హుషారుగా మాస్క్ తీసేసి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: కరోనాను కట్టడి చేసిన దేశంగా నార్త్ కొరియా.. ఎలా సాధ్యమైందంటే..?
అమెరికా అధ్యక్షుడికి ఈ ప్రపంచంలోనే ఎవరికి ఇవ్వని ట్రీట్ మెంట్, మందులు ఇచ్చి ఇలా కోలుకునేలా చేశారట అమెరికన్ వైద్యులు. తమ అనుభవాన్ని అంతా రంగరించి ట్రంప్ గట్టి మందులు ఇచ్చినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఇంత త్వరగా ట్రంప్ కోలుకోవడానికి కారణం ఏంటి? ఆయనకు ఏం మందులు ఇచ్చారు అనే చర్చ మొదలైంది. ట్రంప్ కోలుకోవడం వెనుక ఏ కరోనా మందులున్నాయన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ట్రంప్ వైద్యుల కృషి ఫలితంగానే ఆయన త్వరగా కోలుకున్నట్టు తెలిసింది.
వ్యాధి సోకినట్టు నిర్ధారణ కాగానే ట్రంప్ కు రెండు యాంటీబాడీలను ఇచ్చారు వైద్యులు. ఈ యాంటీ బాడీలను సింగపూర్ కు చెందిన ముగ్గురు పేషంట్ల రక్త నమూనాలతో రూపొందించారని ఆసియన్ సైంటిస్ట్ మ్యాగజైన్ కథనంలో రాసింది.
Also Read: వామ్మో… ఆ గురుకుల కేంద్రంలో 50 మంది విద్యార్థులకు కరోనా..?
ఈ యాంటీ బాడీ థెరపీని ఆర్ఈజీఎన్-సీవోవీ2గా పేర్కొంటారు. మిలటరీ ఆస్పత్రిలో ట్రంప్ కు మూడు రోజులు యాంటీ వైరల్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ ఇచ్చారు. వాటిన్నింటి వల్ల ట్రంప్ తొందరగా కోలుకున్నారని చెబుతున్నారు.
యాంటీ బాడీ థెరపీని ఆర్ఈజీఎన్-సీవోవీ2 థెరపీని వాడడానికి ఇంకా అనుమతులు రాకపోయినా ట్రంప్ కోసం ప్రత్యేక అనుమతి తీసుకొని వాడారని చెబుతున్నారు. అసలే అధ్యక్ష ఎన్నికల సమయం కావడంతో ట్రంప్ సిద్ధమై త్వరగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. శనివారం కరోనా నుంచి కోలుకొని ట్రంప్ వైట్ హౌస్ ముందు బయట పెద్ద సంఖ్యలో చేరిన తన మద్దతు దారులను ఉద్దేశించి మాట్లాడారు.