Commonwealth Games 2022: ఇంగ్లండ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో బంగారం పతకం దక్కింది. నిన్న మీరాభాయి ఛాను ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ అందించి భారతీయులను ఉప్పొంగేలా చేసింది. బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. ముఖ్యంగా వెయిల్ లిఫ్టింగ్ విభాగంలో పతకాల పంట పండిస్తోంది.
ఈరోజు మన దేశానికి మరో గోల్డ్ మెడల్ వచ్చింది. పురుషుల 67 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్ రిన్నుగ మొత్తం 300 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం గెలిచాడు. కాగా ఇప్పటివరకూ మన దేశఆనికి 5 పతకాలు వచ్చాయి.
కామన్ వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్ రిన్నుంగా దుమ్మురేపాడు. 67 కేజీల విభాగంలో ఈ 19 ఏళ్ల కుర్రాడు రికార్డ్ సృష్టిస్తూ బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్లో మొదటి ప్రయత్నంలో 154 కేజీలు ఎత్తిన జెరెమీ.. రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300 కేజీలకు పైగా ఎత్తి ఓవరాల్ గా రికార్డు సృష్టించాడు.
వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో రజత పతకంతో మెరిసిన సంకేత్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నగదు రివార్డ్ ప్రకటించారు. సంకేత్ కు రూ.30 లక్షలు, ఆయన ట్రైనర్ కు రూ.7 లక్షలు చొప్పున రివార్డుగా ఇవ్వనున్నట్లు సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇక నిన్న కామన్ వెల్త్ గేమ్స్ రెండో రోజు భారత వెయిట్ లిఫ్టర్లు మూడు పతకాలు సాధించడం విశేషం. తొలుత పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించగా.. 61 కేజీల పురుషుల విభాగంలో గురురాజ పుజారి కాంస్య పతకం నెగ్గాడు. మీరాభాయి ఛాను కామన్ వెల్త్ క్రీడల్లోనూ సత్తా చాటింది. ఏకంగా భారత్ కు తొలి గోల్డ్ మెడల్ ను అందించింది. 49 కేజీల విభాగంలో మొత్తం 201 కేజీల బరువును ఎత్తి స్వర్ణం గెలిచి, ఆ విభాగంలో గేమ్ రికార్డు నెలకొల్పింది.
ఈ నాలుగు పతకాలు కూడా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే భారత్ కు దక్కడం విశేషం. నలుగురు వెయిట్ లిఫ్టర్లు కలిసి రెండు బంగారు పతకాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకాలు సాధించి మొత్తం నాలుగు పతకాలు అందించి భారత ప్రతిష్టను ఇనుమడింపచేశారు.