Aniket Verma : ఇటీవల విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అనికేత్ వర్మ దుమ్ము రేపాడు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓడిపోయినప్పటికీ.. అనికేత్ వర్మ ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైనప్పటికీ అనికేత్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ చాలామందిని ఆకట్టుకున్నది.. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ (Jhansi) ప్రాంతానికి చెందిన అనికేత్ వర్మ .. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు.. తండ్రి గురించి పెద్దగా సమాచారం లేదు. మేనమామ బ్యాంకులలో రుణాలు తీసుకొని అనికేత్ వర్మ కు ట్రైనింగ్ ఇప్పించాడు. దీంతో అనికేత్ వర్మ రాటు తేలాడు. బీభత్సమైన బ్యాటింగ్ తో తనను తాను మలచుకున్నాడు. అందువల్లే హైదరాబాద్ జట్టు తరుపున ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అదరగొట్టాడు.. 41 బంతుల్లోనే 74 పరుగులు చేసి సంచలన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.
Also Read : రాహుల్ ను చూశాక కూడా.. పంత్.. నీ బతుకు పగోడికి కూడా రావద్దు సామీ.
దూకుడుగా ఆడేందుకు అదే కారణమట
అనికేత్ వర్మ ఇలా దూకుడుగా ఆడేందుకు ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అట. ఇదే విషయాన్ని అనికేత్ వర్మ మేనమామ అమిత్ వర్మ వెల్లడించాడు.. అప్పట్లో హార్థిక్ పాండ్యా నాలుగు సంవత్సరాల పాటు మ్యాగీ నూడుల్స్ మాత్రమే తిని క్రికెట్ ప్రాక్టీస్ కు వెళ్లేవాడు. అయితే హార్దిక్ పాండ్యా చెబుతున్న విషయాన్ని అనికేత్ వర్మ.. అతడు కూడా దానినే పాటించడం మొదలుపెట్టాడు. కెరియర్ ను సీరియస్ గా తీసుకొని సన్నద్ధమయ్యాడు..” అప్పుడు అనికేత్ వర్మ 14 సంవత్సరాల బాలుడు. ఒకసారి న్యూస్ పేపర్లో హార్దిక్ పాండ్యా మ్యాగీ నూడుల్స్ తిని ప్రాక్టీస్ కు వెళ్లానని చెప్పిన వార్త చదివాడు. దాంతో అనికేత్ వర్మ కెరియర్ ను సీరియస్ గా తీసుకున్నాడు. మ్యాగీ నూడుల్స్ మాత్రమే తిని ప్రాక్టీస్ కు వెళ్లాడు. అప్పటినుంచి ఆటపట్ల విపరీతమైన శ్రద్ధ వహించాడు. పరుగులు విపరీతంగా చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లోనే అతడు అద్భుతమైన ఆటగాడుగా రూపాంతరం చెందుతాడని భావించాను.. ఇప్పుడు అదే నిజమైందని” అనికేత్ వర్మ మేనమామ అమిత్ వర్మ వ్యాఖ్యానించాడు..” హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో తన సత్తా చూపించిన తర్వాత జాతీయ జట్టులోకి ప్రవేశించాడు.అనికేత్ వర్మ ఏదో ఒక రోజు జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తాడనే నమ్మకం ఉందని” అమిత్ వర్మ పేర్కొన్నాడు. మరోవైపు అనికేత్ వర్మ బ్యాటింగ్ స్టైల్ పై టీమిండియా సీనియర్ ఆటగాడు చటేశ్వర్ పూజార కీలక వ్యాఖ్యలు చేశాడు. ” ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 37/4 వద్ద ఉంది. ఈ దశలో జట్టును ఆదుకోవడానికి అనికేత్ వర్మ తన వంతు ప్రయత్నం చేశాడు. ఒక రకంగా ఏటికి ఎదురు ఈదడం మొదలుపెట్టాడు. అతడి ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోయినప్పటికీ.. చేసే పనిలో మాత్రం అతడు విఫలం కాలేదు. అందువల్లే అతడి బ్యాటింగ్ బాగుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా అతడు ఆడిన తీరు అమోఘంగా ఉంది. అతడు ఎలాంటి ఆటగాడు అవుతాడు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని” పూజార వ్యాఖ్యానించాడు.
Also Read : “సంతకం” స్టార్ కు దిమ్మతిరిగే షాక్.. జన్మలో ఆ పని చేయడు.
The best comparison with Aniket Verma would prolly be Priyam Garg.
We expected Garg to play the same way at 4/5/6 like how Aniket is playing now.#SRH #IPL2025pic.twitter.com/DUJwU3XE9Y
— Varun Velamakanti (@SunRisersVarun) March 31, 2025