Sunrisers Hyderabad: స‌న్ రైజ‌ర్స్ తీరుతో అభిమానుల్లో ఆగ్ర‌హం? సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు

Sunrisers Hyderabad:  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) పండుగ నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఫ్రాంచైజీలు కూడా ఆట‌గాళ్ల వేలం నేటి నుంచి చేప‌డుతున్నారు. దీంతో ఫ్రాంచైజీలు ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేస్తున్నాయి. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కొనుగోలులో నిమ‌గ్న‌మైతే హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ మాత్రం ఏ ఆట‌గాడిని కొనుగోలు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో అభిమానులు ఫ్రాంచైజీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు నిర్వాహ‌కుల ఉద్దేశం ఏమిటో అర్థం కావ‌డం లేదు. హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ తీరుతో అభిమానుల పోస్టులు […]

Written By: Srinivas, Updated On : February 12, 2022 4:27 pm
Follow us on

Sunrisers Hyderabad:  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) పండుగ నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఫ్రాంచైజీలు కూడా ఆట‌గాళ్ల వేలం నేటి నుంచి చేప‌డుతున్నారు. దీంతో ఫ్రాంచైజీలు ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేస్తున్నాయి. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కొనుగోలులో నిమ‌గ్న‌మైతే హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ మాత్రం ఏ ఆట‌గాడిని కొనుగోలు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో అభిమానులు ఫ్రాంచైజీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు నిర్వాహ‌కుల ఉద్దేశం ఏమిటో అర్థం కావ‌డం లేదు.

Sunrisers Hyderabad

హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ తీరుతో అభిమానుల పోస్టులు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అస‌స‌లు ఫ్రాంచైజీ ఆటగాళ్ల‌ను కొనుగోలు చేయ‌కుండా ఎలా ఆట‌లో పాల్గొంటుందో అర్థం కావ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక్క మ‌నీష్ పాండే కోసం మాత్రమే బిడ్ వేసింది. కానీ అత‌డు కూడా వేలంలో ఎక్కువ ధ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read: ఆ సీఎం నినాదాన్ని వాడేస్తున్న రేవంత్‌.. స‌క్సెస్ అవుతుందా…?

దీంతో స‌న్ రైజ‌ర్స్ ఈ సీజ‌న్ లో ప్ర‌భావం చూపుతుందో లేదో అనే అనుమానాలు అంద‌రిలో వ‌స్తున్నాయి. గ‌త నాలుగు సీజ‌న్ల‌లో మ‌నీష్ పాండే రూ. 44 కోట్లు తీసుకుని స‌న్ రైజ‌ర్స్ కు న‌ష్ట‌మే త‌ప్ప లాభం చేయ‌లేదు. దాన్ని మ‌రిచిపోయి మ‌ళ్లీ అత‌డినే తీసుకోవాల‌ని మేనేజ్ మెంట్ చూడ‌టం ఆందోళ‌న‌కు దారి తీస్తోంది. దీంతో అభిమానులు సోష‌ల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. ప‌చ్చి బూతుల‌తో చెడామడా తిట్టేస్తున్నారు. అయినా నిర్వాహ‌కుల్లో ఏ మాత్రం చ‌ల‌నం మాత్రం క‌నిపించ‌డం లేదు.

Sunrisers Hyderabad

ఫ్రాంచైజీ నిర్వ‌హించ‌డం చేత‌కాకపోతే మూసేసుకోవ‌డం త‌ప్ప మార్గం ఏమీ క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ లో మునుప‌టి లాగే చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసి అప్ర‌దిష్ట మూట‌గ‌ట్టుకుంటే అభిమానుల ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు. ఇప్ప‌టికైనా ఫ్రాంచైజీ క‌నువిప్పుతో వ్య‌వ‌హ‌రించి మంచి ఆటగాళ్ల‌ను వేలంలో ద‌క్కించుకుని విజ‌యాలు న‌మోదు చేసి క‌ప్ సొంతం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

దీనికి గాను నిర్వాహ‌కుల్లో ఎందుకింత నిర్ల‌క్ష్యం అనే వాద‌న‌లు వ‌స్తున్నాయి. జ‌ట్టుకు ముప్పు తెచ్చే వారి కోసం ఎదురు చూడ‌టానికి బ‌దులు మంచి ఫామ్ లో ఉన్న వారిని వేలంలో ద‌క్కించుకుని అటు అభిమానుల ఇటు నిర్వాహ‌కుల ఆశ‌లు నెర‌వేర్చాల్సిన సంద‌ర్భాన్ని గుర్తిస్తే మంచిది. లేక‌పోతే వివాదాలు చోటుచేసుకునే అవ‌కాశం ఏర్ప‌డింది.

Also Read: అప్పటి ముచ్చట్లు : ఆ మాటలు విని గుమ్మడి గారు ఆశ్చర్యపోయారు !

Tags