Angelo Mathews : నిజం చెప్తున్నా.. ఇది నయా శ్రీలంక జట్టు.. దానికి కారణం అతడే.. ఏంజెలో మాథ్యూస్ సంచలన వ్యాఖ్యలు..

శ్రీలంక జట్టు మారిపోయింది. ఒకప్పటిలాగా తడబడటం లేదు. ధాటిగా ఆడుతోంది. దీటుగా పరుగులు చేస్తోంది. ఆటగాళ్లు గెలవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రత్యర్థి ఆటగాళ్ల ఎత్తులను చిత్తుల చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 29, 2024 2:21 pm

Angelo Mathews

Follow us on

Angelo Mathews : శ్రీలంక జట్టు కోచ్ గా ప్రస్తుతం జయసూర్య కొనసాగుతున్నాడు. గతంలో శ్రీలంక జట్టులో అతడు కీలకమైన ఆటగాడిగా కొనసాగాడు. కెప్టెన్ గా ముందుకు నడిపించాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇప్పుడు కోచ్ గా సరికొత్త అవతారం ఎత్తాడు. అవసానదశకు చేరుకున్న శ్రీలంక క్రికెట్ కు సరికొత్త నిర్దేశం చేస్తున్నాడు. యువకులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చి.. మైదానంలో చెలరేగేలా శిక్షణ ఇస్తున్నాడు. అందువల్లే శ్రీలంక విజయాలను సాధిస్తోంది. ఇటీవల ఇంగ్లాండు జట్టు లో శ్రీలంక పర్యటించింది. 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. చివరి టెస్టులో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆశలను అడియాసలు చేసింది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో వైట్ వాష్ చేసింది. అంతకుముందు భారత జట్టుతో స్వదేశంలో జరిగిన 3 వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది.. ఇలా శ్రీలంక జట్టు వరుసగా విజయాల బాట పట్టడానికి ప్రధాన కారణం ఆ జట్టు కోవచ్చు జయ సూర్య అని చెప్పక తప్పదు. ముఖ్యంగా భారత జట్టుపై 27 సంవత్సరాల తర్వాత శ్రీలంక వన్డే సిరీస్ తగ్గించుకుంది. అనేక దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇంగ్లాండ్ జట్టుపై చిరస్మరణీయ టెస్టు విజయాన్ని సొంతం చేసుకుంది. 15 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ జట్టుపై టెస్టు సిరీస్ విజయాన్ని సాధించింది..

అతడే కారణం

శ్రీలంక జట్టు వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో.. దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని మాజీ క్రికెటర్ , శ్రీలంక జట్టు కీలక సభ్యుడు ఎంజెలో మాథ్యూస్ వివరించాడు.” మైదానంలో ప్రదర్శన మాత్రమే జట్టును గెలిపించదు. డ్రెస్సింగ్ రూమ్ లో సానుకూల వాతావరణం ఉండాలి. సుహృద్భావ దృక్పథాన్ని పెంపొందించాలి.. శ్రీలంక జట్టులో వీటిని కోచ్ జయ సూర్య పెంపొందిస్తున్నారు. శ్రీలంక జట్టు పై ఆయన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నారు.. క్రికెట్ డైరెక్టర్ గా, శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ గా ఆయన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు. యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. అందువల్ల శ్రీలంక జట్టు రెట్టింపు ఉత్సాహంతో ఆడుతోంది. ఒకప్పటి జట్టు లాగా కనిపిస్తోంది. అందువల్లే వరుస విజయాలు సాధిస్తోంది. ఇలాంటి పరంపరను మరింత వేగంగా కొనసాగించాలని జట్టు ఆటగాళ్లు భావిస్తున్నారు.. ఒకప్పుడు ఆటగాళ్లు ఓటమి అంటే భయపడేవాళ్లు. ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. వైఫల్యానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. కొత్త కోచ్ నాయకత్వంలో శ్రీలంక జట్టు సరికొత్తగా రూపుదిద్దుకుంది. అందువల్లే శ్రీలంక జట్టు ఆ విధంగా పుంజుకుంది. సింగర్ ఆటగాళ్లకు సహకారం అందించడం.. యువ ఆటగాళ్లలో ప్రతిభను పెంపొందించడంలో జయ సూర్య ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అందువల్లే శ్రీలంక జట్టు ఇలా రూపుదిద్దుతుందని” మాథ్యూస్ వ్యాఖ్యానించారు.