https://oktelugu.com/

Anand Mahindra : శీతల్ దేవి ప్రదర్శనకు ఫిదా.. అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేస్తున్న ఆనంద్ మహీంద్రా

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో పారా స్టార్ ఆర్చర్ శీతల్ దేవి వెంట్రుకవాసిలో మెడల్ కోల్పోయింది. అయినప్పటికీ తన ప్రతిభతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి మొదలుపెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాకా ఆమె ఆట తీరును ప్రదర్శించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 2, 2024 / 07:43 PM IST

    Anand Mahindra

    Follow us on

    Anand Mahindra : శీతల్ దేవి ప్రదర్శన ప్రఖ్యాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్నది. ఆమె గురిపెడుతున్న వీడియో ఆనంద్ మహీంద్రా ను ఆశ్చర్య చకితుణ్ణి చేసింది. “అచంచలమైన ధైర్యం.. అనితర సాధ్యమైన నిబద్ధత.. ఆటపై మొక్కవోని విశ్వాసం.. పట్టుదలని క్రీడా స్ఫూర్తి.. వీడికి మెడల్స్ తో సంబంధం ఉండదు. మీరు దేశానికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచానికి గర్వకారణంగా మారారు” అంటూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా శీతల్ దేవిని అభినందించారు..

    శీతల్ దేవి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ..

    శీతల్ దేవి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గత ఏడాది ఆనంద్ మహీంద్రా ఒక కారును బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. శీతల్ దేవి పారిస్ పారాలింపిక్స్ లో త్రుటిలో మెడల్ కోల్పోయిన నేపథ్యంలో.. ఆమె ప్రతిభను అభినందిస్తూ.. ఈ ఏడాది క్రితం కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని ఆనంద్ గుర్తు చేసుకున్నారు. “శీతల్ దేవి తనకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత తన ఆఫర్ స్వీకరిస్తారని అన్నారు. దాని ప్రకారం వచ్చేయడాది మహేంద్ర కారు మీ చేతికి లభిస్తుంది. ఆరోజు నేను ప్రకటించిన ఆ బహుమతి మీ చేతికి వస్తుందని భావిస్తున్నాను. ఆరోజు కోసం నేను ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను” అంటూ ఆనంద్ చెప్పుకొచ్చారు.

    ఆకట్టుకున్న ప్రదర్శన

    పారిస్ పారాలింపిక్స్ లో శీతల్ దేవి ఆర్చరీలో చూపించిన ప్రదర్శన యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ తన కాలిని విల్లుగా మార్చుకుంది. ఆ దృశ్యం చాలామందిని ఆకట్టుకుంది. ఆమె ప్రత్యర్థి వీల్ చైర్ లో కూర్చుని చేతులతో బాణం వేసి.. మెడల్ సాధించింది. అయితే శీతల్ మాత్రం తన కాలిని విల్లుగా మార్చుకుంది. వెంట్రుకవాసిలో మెడల్ కోల్పోయింది. ఇక ప్రపంచంలో ఉన్న పారా అథ్లెట్లలో శీతల్ దేవి ఒకరు. అంతేకాదు ఆర్మ్ లెస్ అథ్లెట్లలో అత్యంత చిన్న వయసు ఆర్చర్ గా శీతల్ దేవి ముందు వరుసలో ఉంటుంది. మరోవైపు శీతల్ దేవి ప్రదర్శన పట్ల టీం ఇండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆమె ప్రదర్శన యావత్ భారతజాతిని ఆకట్టుకుందని కొనియాడాడు. ” ఆమె ప్రదర్శన అద్భుతంగా ఉంది. కాలిని విల్లుగా మరిచిన తీరు గొప్పగా అనిపించింది. నిజమైన క్రీడా స్ఫూర్తి ఇదే. ఎన్ని కష్టాలు ఎదురైనా… ఎన్ని ఇబ్బందులు చుట్టుముట్టినా ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుంది. అందువల్లే పారిస్ పారాలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శన చూపించిందని” హర్భజన్ వ్యాఖ్యానించాడు.