Bigg boss telugu day 2 promo : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలు అవ్వడమే లేట్.. అప్పుడే హౌస్ లో గొడవలు ప్రారంభం అయ్యాయి. నిన్న గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 14 కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. ఒక్కో కంటెస్టెంటగా కాకుండా జోడీ గా ఈ సీజన్ లో హౌస్ లోపలికి వెళ్లారు. అయితే సీజన్ లో మొదటి రోజే గొడవలు మొదలయ్యాయి. ప్రేక్షకులు ఎంత గానే ఎదురుచూస్తున్నా గొడవలు ఈరోజే స్టార్ట్ అయ్యాయి. బిగ్ బాస్ మొదటి రోజు ప్రోమో విడుదల అయ్యింది. ఈ మధ్య కాలంలో సెన్సేషనల్ అయిన శేఖర్ బాషా ప్రోమో లో హైలైట్ గా నిలిచారు. ఇంతకీ ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ చేస్తూనే.. ఇంట్లో గోడవలు పుట్టించాడు. ఫేక్ ఎలిమినేషన్ అంటూ నాగ మణికంఠ ని చేశారు. హౌస్ లో విష్ణు ప్రియా, బేబాక్క, నైనిక, సోనియా అందరు నాగ మణికంఠ ఎలిమినేట్ కావాలని ఓట్లు వేశారు. అందరు అతన్ని కార్నర్ చేసారని.. ఎమోషనల్ అవుతూ తన బాధని నిఖిల్, పృథ్వి కి చెప్పాడు. ఆదిత్య ఓం గురించి చెబుతూ.. డే 2 ప్రోమో స్టార్ట్ అయింది. ఆ తరువాత పొద్దునే కావడం అందరు సరదాగా డాన్స్ లు వేశారు. కొద్ది సేపటికే గొడవ మొదలయింది. అందరు కలిసి ఆరెంజ్ పండ్లుతో ఆడుకుంటుంటే.. సోనియా కోపం అయ్యింది. ఆరెంజ్ తో ఆడిన వాళ్లు అవి తినవద్దు అని అంది. దీంతో శేఖర్ బాషా కి కోపం వచ్చి.. రూల్స్ ఉన్నాయా ఆరెంజెస్ తో ఆడకూడదని అన్నరు. అయితే తినే వాటితో ఆటలేంటి అని ఆమె అన్నారు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. నీకు నచ్చినట్లు చేసుకో.. వాటిని కింద వేసి తొక్కుతావో, డ్రైనేజీ లో వేసుకుంటావో, ఏదయినా చేసుకో కానీ ఇతరులకు మాత్రం పెట్టకు.. మనుషుల్లా తినే వాళ్లకు అయితే అసలు పెట్టకని.. కౌంటర్ ఇచ్చింది.
శేఖర్ బాషా మాత్రం ఆడిన వాటిని తినకూడదా.. అని వాటిని తిన్నాడు. ఇప్పుడు నేను మనిషిని కానా అని మళ్లీ మాట మాట వాదన పెట్టుకున్నాడు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చారు. పట్టుకునే ఉండండి అనే ఆట ఆడారు. హోరా హోరీగా పోటీపడుతూ అందరు ఆడారు. ఇకపై బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి గొడవలు అవుతాయి. ఎంత పోటీ మీద ఆడుతారో మరి చూడాలి.