Ravichandran Ashwin: ఒకప్పుడు భారత్ క్రికెటర్ల విషయంలో వసతులే కాదు వనరులు కూడా ఎంతో తక్కువగా ఉండేవి. కానీ గత కొద్ది కాలంగా లెక్కలు మారాయి అని చెప్పవచ్చు. ప్రస్తుతం భారత్ క్రికెటర్లకు ఆట ఒక్కటే ఆదాయం కాదు అంతకుమించి ఆదాయ వనరులు అనేకం ఏర్పడుతున్నాయి. క్రికెట్ మోజు పెరిగే కొద్దీ క్రికెటర్ల సంపాదన కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒక క్రికెటర్ ఆస్తుల విలువ అందరిని అవాక్కేలా చేస్తుంది. ఇంతకీ ఎవరు ఆ క్రికెటర్ అనుకుంటున్నారా …ఇండియన్ క్రికెట్ లో తనకంటూ అత్యంత ప్రాధాన్యత సంపాదించుకున్న స్పిన్నర్ అశ్విన్.
స్పినర్గా మంచి క్రేజ్ సంపాదించిన ఈ ఇండియన్ క్రికెటర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఎవరైనా షాక్ ఫీల్ అవ్వాల్సిందే. అశ్విన్ క్రికెటర్ గా మారకముందు ఇంజనీరింగ్ చదివాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే అతనికి ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ చదువుని ఎక్కడా అశ్రద్ధ చేయలేదు. చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అశ్విన్ ఐటి బ్రాంచ్ లో బీటెక్ కంప్లీట్ చేశాడు. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క సి కే విజయ్, చంద్ర సహాయ సహకారాలతో క్రికెట్లో తనకంటూ ఒక మంచి ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ వేలంలో అశ్విన్ ఐదు కోట్ల విలువ పలికాడు. ఇక ఈ సీజన్లో అతను ఆడిన 13 ఇన్నింగ్స్ లో 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో పాటుగా తరువాత జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండు మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి తన ఫామ్ నిరూపించుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఇప్పటికే టీమిండియా బెస్ట్ స్పిన్నర్ గా అశ్విన్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ ప్రస్తుతం ఉన్న టీం లో అనుభవజ్ఞుడు మాత్రమే కాదు చాలా కాలం నుంచి బీసీసీఐ కాంట్రాక్ట్ ప్లేయర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి. మరో పక్క అతను ఐపీఎల్లో కూడా ఎంతో నిలకడైన ప్రదర్శనను కనబరుస్తూ బాగా రాణిస్తున్నాడు. ఈ కారణాల చేత అతని నెలసరి ఆదాయం సుమారు కోటి రూపాయలు అని తెలుస్తోంది. బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్టులో ఏ గ్రేడ్ లో ఉన్న వ్యక్తి కాబట్టి అశ్విన్ ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు అందుకుంటాడు. ఇటు ఐపీఎల్ లో కూడా భారీ పారితోషకం పుచ్చుకోవడం వల్ల ప్రతి సంవత్సరం కొన్ని కోట్లు సంపాదిస్తాడు.
మన ఇండియన్ క్రికెటర్స్ మోడల్స్ కి ఎక్కడా తీసిపోరు.. ఎందుకంటే వాళ్లకు ఉన్నటువంటి బ్రాండ్ పాపులారిటీ కూడా అలాగే ఉంటుంది కాబట్టి. మరి ఈ సక్సెస్ఫుల్ ఆఫ్ స్పిన్నర్ కి కూడా మింత్రా, బాంబే షేవింగ్ కంపెనీ, మన్నా ఫుడ్స్, అరిస్టోక్రాట్ బ్యాగ్‌లు, ఒప్పో, మూవ్, స్పెక్స్‌మేకర్స్ మరియు రామ్‌రాజ్ లినెన్ షర్ట్స్ లాంటి పెద్ద బ్రాండ్స్ తో
ఎండార్స్‌మెంట్ ఉంది. ఇలా లెక్క వేసుకుంటూ పోతే అతని ఆస్తి విలువ సుమారు 132 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్క అశ్విన్ అనే కాదు ఇలా మన క్రికెట్ టీం లో కాస్త క్రేజ్ సంపాదించుకొని …ఫ్రమ్ నో వేర్ టూ సమ్ వేర్ వెళ్లిన ప్లేయర్స్ ఎందరో ఉన్నారు.