https://oktelugu.com/

Amitabh Bachchan: అమితాబ్ కు ఒళ్ళు మండింది.. ఆసీస్ పక్షపాత ధోరణిపై ఒంటి కాలుపై లేచారు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

అమితాబ్ బచ్చన్.. భారతీయ చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. భాషతో సంబంధం లేకుండా ఎన్నో అజరామరమైన చిత్రాలలో అమితాబ్ నటించారు. నటిస్తూనే ఉన్నారు. ఎనిమిది పదుల వయసులోనూ ఆయన ఇప్పటికీ యాక్టివ్ గానే ఉన్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 28, 2024 / 11:49 AM IST

    Amitabh Bachchan

    Follow us on

    Amitabh Bachchan: సమకాలీన అంశాలపై అమితాబ్ తనదైన స్పందనను తెలియజేస్తూనే ఉంటారు. మంచి జరిగితే అభినందిస్తారు. చెడు జరిగితే డొక్క చించి డోలు వాయిస్తారు. సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ఎప్పటికప్పుడు తనదైన వాణి వినిపిస్తారు. వివిధ వేదికలపై ఆ అంశాలకు సంబంధించి మాట్లాడుతుంటారు. అందుకే హిందీ చిత్ర పరిశ్రమలో ” ఓపెన్ ఎక్స్ పోజర్” గా అమితాబ్ కు పేరుంది. గత కొంతకాలంగా అమితాబ్ సందేశాత్మక చిత్రాలలోనే నటిస్తున్నారు. ఇటీవల తెలుగులో కల్కి అనే సినిమాలో నటించారు. అందులో అశ్వద్ధామ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడిన మ్యాచ్ లో.. బుమ్రా సేన విజయం సాధించినప్పటికీ.. అది అమితాబ్ కు కోపం తెప్పించింది..

    ఇంతకీ ఏం జరిగిందంటే

    పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిర్వాహకులు నిర్వహించిన వ్యాఖ్యానం (కామెంట్రీ) లో పక్షపాత ధోరణి కనిపించిందని అమితాబచ్చన్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ప్రస్తావించారు. ” ఏకపక్ష విధానంలో కామెంట్రీ సాగింది. దానిని ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. బయాస్ కామెంట్రీకే బావ జూద్ టోక్ దియా ఆస్ట్రేలియా క్రికెట్ మే” అంటూ అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన వ్యాఖ్యానం ఏకపక్ష దారుణంలో కొనసాగినప్పటికీ.. భారత్ విజయం సాధించిందని అమితాబ్ తన పోస్ట్ ద్వారా తెలియజేశారు.. అయితే అమితాబ్ చేసిన ట్వీట్ ను నెటిజన్లు సమర్థించారు..” ఇలాంటి విషయాలలో సెలబ్రిటీలు తన దూర్చరు. కాకపోతే అమితాబ్ స్టైల్ వేరు. ఆయన తన స్పందనను తెలియజేశారు. మొహమాటం లేకుండా అసలు విషయాన్ని చెప్పేశారు. ఇలా చెప్పాలంటే గుండె ధైర్యం ఉండాలి. ముఖ్యంగా టీమిండియా విషయంలో అమితాబ్ ముందు వరుసలోనే ఉంటారు. ఆయన క్రికెట్ ఎక్కువగా చూస్తుంటారు. ఆటగాళ్ల ప్లేయింగ్ స్టైల్ ను ఇష్టపడుతుంటారు. అందువల్లే తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇది చాలా గొప్ప విషయం. టీమిండియా కు ఆస్ట్రేలియా వేదికగా అనుకున్నంత స్థాయిలో స్వాగతం లభించడం లేదు. అందుకు అమితాబ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఇప్పటికైనా ఆస్ట్రేలియా తన ధోరణి మార్చుకోవాలి. అప్పుడే క్రీడా స్ఫూర్తి ఫరిడ విల్లుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా గనుక భారత్ లో పర్యటిస్తే.. ఆ జట్టుకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే.. ఎలా ఉండేదో.. అక్కడ మీడియా ఎలా రాసేదో.. క్షమాగుణం, దయాగుణం భారతీయుల రక్తంలో ఉంది. పెర్త్ టెస్టులో అది అణువణువు కనిపించిందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.