Army Recruitment: ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే తెలంగాణ యువతకు ఇదొక సువర్ణావకాశం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని జీఎం బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని ఇండియన్ ఆర్మీ నిర్వహించనుంది. డిసెంబర్ 8వ తేదీ నుంచి 16 తేదీ వరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి కేవలం పదో తరగతి ఉత్తీర్ణత అయిన తెలంగాణకి చెందిన యువత మాత్రమే అర్హులు. మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ అగ్నివీర్‌లో చేరడానికి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జోగుళాంబ గద్వాల్, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మంచిర్యాల, మహబూబాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల అభ్యర్థులు పాల్గొనవచ్చు.
ఇండియన్ ఆర్మీ నిర్వహించే ఈ అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ టెక్నికల్, స్టోర్ కీపర్ వంటి ఉద్యోగాలకు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అదే అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు అయితే 8వ తరగతి అర్హత ఉండాలి. అలాగే ఫిబ్రవరి 12న విడుదలైన ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మహిళా మిలిటరీ పోలీస్ పోస్టులకు అభ్యర్థులు హాజరవ్వచ్చు. వీరు ర్యాలీ జరిగే ప్రదేశానికి అన్ని డాక్యుమెంట్లు వివరాలను తీసుకురావాలని బోర్డు తెలిపింది. నోటిఫికేషన్‌లో ఏ విధంగా వివరాలు ఉన్నాయో వాటిన్నింటిని తీసుకురావాలని సూచించింది. ఈ నియామకాలు పారదర్శంగా ఉంటాయి. వారి అర్హతలు, టాలెంట్ బట్టి ఇస్తారు. అంతే కాని ఎవరైనా ఉద్యోగం ఇస్తామని అంటే డబ్బులు కట్టి మోసపోవద్దని తెలిపారు. ఫేక్ మేసెజ్‌లు, యాడ్‌లకు అసలు నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అగ్నివీర్ ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు సందేహాలు ఏవైనా ఉంటే మాత్రం రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఫోన్ నంబర్‌కి కాల్ చేసి సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు. సందేహలను క్లియర్ చేసుకోవడానకి 040-27740059, 27740205కి చేయవచ్చు.
వీటితో పాటు IOCL చెన్నైలో 240 అప్రెంటీస్‌ల పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవడానికి నవంబర్ 29 చివరి తేదీ. అలాగే నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉన్న 188 పోస్టులకు నవంబర్ 30వ తేదీ లాస్ట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న 253 పోస్టులకు డిసెంబర్ 3వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. రైల్వే గువాహతి 5647 అప్రెంటీస్‌లకు డిసెంబర్ 3వ తేదీ చివరితేదీ. సీడాక్‌లో ఉన్న 98 పోస్టులకు డిసెంబర్ 5వ తేదీ, సీఈఆర్‌ఐలో ఉన్న 37 పోస్టులకు డిసెంబర్ 6వ తేదీ, సీఆర్‌పీఎఫ్‌లో ఉన్న 124 పోస్టులకు డిసెంబర్ 7వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. బీఈఎల్‌లో ఉ్న 229 పోస్టులకు డిసెంబర్ 10వ తేదీ, ఐఐటీ హైదరాబాద్‌లో 31 పోస్టులకు డిసెంబర్ 10వ తేదీ, గెయిల్‌లో ఉన్న 261 పోస్టులకు డిసెంబర్ 11వ తేదీ, ఎస్‌బీఐలో ఉన్న 169 పోస్టులకు డిసెంబర్ 12వ తేదీ, ఐటీబీపీలో ఉన్న 526 పోస్టులకు డిసెంబర్ 14వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.