Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప 2 : ది రూల్’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుమారుగా మూడేళ్ళ పాటు అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తన విలువైన సమయాన్ని కేటాయించాడు. 5 ఏళ్ళ నుండి కేవలం పుష్ప లుక్ లోనే ఉన్నాడు. ఈ చిత్రం కోసం ఆయన పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ ని కూడా పక్కన పెట్టాడు. రేయింబవళ్లు ఎంతో కష్టపడి ఈ చిత్రం కోసం పని చేసాడు. ఆయన ఏ రేంజ్ లో కష్టపడ్డాడు అనేందుకు చిన్న శాంపిల్ గా మొన్న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ని చూడొచ్చు. తన నట విశ్వరూపాన్ని చూపించేసాడు అనే చెప్పాలి. కేవలం థియేట్రికల్ ట్రైలర్ మాత్రమే కాదు, ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.
సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ జారీ చేసారు. సినిమా రన్ టైం 2 గంటల 59 నిమిషాల 51 సెకండ్స్ ఉంటుందట. సెన్సార్ సభ్యుల నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘పుష్ప 2’ కేవలం ఒక సినిమా కాదు, ఒక బాక్స్ ఆఫీస్ సునామీ. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రం కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్ గురించి అయితే ఇక మాటల్లేవ్, మాట్లాడుకోడాలు లేవ్ అనే రేంజ్ లో ఉంటుందట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, క్లైమాక్స్ లో హీరో తో పాటు, హీరో కుటుంబం కూడా చనిపోతారని, విలన్ గ్యాంగ్ హీరో ఇంటి మీద బాంబులు వేసినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంటుందని, ఒక్క కేశవ తప్ప అందరూ చనిపోతారని తెలుస్తుంది. కానీ కేశవ హీరో కొడుకుని కూడా కాపాడుతాడు. ఆ కొడుకుతోనే పుష్ప పార్ట్ 3 ఉంటుందని సమాచారం.
ఇంతకి పుష్ప కొడుకు క్యారక్టర్ ఎవరు చేసారు..?, అల్లు అర్జునే చేశాడా?, లేకపోతే వేరే హీరో చేశాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తుంది కదూ..ఇక సుకుమార్ తన అద్భుతమైన విజన్ తో టేకింగ్ తో ఏ రేంజ్ లో ఈ సన్నివేశాన్ని తెరకెక్కించి ఉంటాడో మీరే ఊహించుకోండి. సినిమాలో ప్రతీ 10 నిమిషాలకు ఒక భారీ ఎలివేషన్ సన్నివేశం ఉంటుందట. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ మూవీ లవర్స్ కి ఒక కనుల పండుగ లాగా ఉంటుందట. ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిస్టరీ లో ఇంతటి హై ఆక్టేన్ సన్నివేశాన్ని ఎవ్వరూ తెరకెక్కించలేదట. ఇలాంటి సన్నివేశాలు ఫస్ట్ లో మూడు, సెకండ్ హాఫ్ లో నాలుగు ఉంటాయట. బాక్స్ ఆఫీస్ లెక్కలు ఈ లెక్కన ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి.