IPL Auction 2008 : ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి ఆటగాళ్లను జట్లు కొనుగోలు చేశాయి. అయితే ఇప్పటివరకు వేలం ఒక విధంగా సాగితే.. 2008లో మాత్రం భిన్నంగా సాగింది. ఐపీఎల్ లో ప్రారంభ ఎడిషన్ 2008 సంవత్సరం కాగా.. ఆ మొదటి వేలంలో ఒక ఆటగాడి కోసం ప్రతి జట్టు కూడా బిడ్ దాఖలు చేసింది. ప్రారంభ ఎడిషన్ లో నిర్వహించిన మొదటి వేలంలో ఒక ప్రత్యేకమైన నిబంధనను ఐపిఎల్ నిర్వహణ కమిటీ తెరపైకి తీసుకువచ్చింది. స్థానిక అభిమానులతో అనుసంధానమయ్యే ఐకానిక్ ఆటగాడిని ఎంచుకునే విధంగా జట్లకు అవకాశం ఇచ్చారు. అయితే వేలంలో ఆ జట్టు యాజమాన్యం వేసిన ఎక్కువ బిడ్ కంటే ఐకానిక్ ఆటగాడికి 15% ఎక్కువ ధర చెల్లించాలని నిబంధన విధించారు. అయితే ముంబై జట్టు తన ఐకానిక్ ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ను ఎంచుకుంది.. అయితే ఆ సంవత్సరం ముంబై జట్టు సనత్ జయ సూర్య మీద ఎక్కువ బిడ్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ముంబై జట్టు అతనికి ఇవ్వాల్సిందని కంటే 15% అధికానికి సచిన్ టెండూల్కర్ చెల్లించాల్సి వచ్చింది. ఇక అప్పట్లో జయ సూర్యను ముంబై 8 కోట్లకు కొనుగోలు చేస్తుంది. అయితే టెండూల్కర్ కోసం ఫ్రాంచైజీ 9.2 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ముంబై, కోల్ కతా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ జట్లు తమ ఐకాన్ ఆటగాళ్లుగా, సారధులుగా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ ను ఎంచుకున్నాయి.
మొదట్లో చెన్నై జట్టు
ప్రారంభ సీజన్లో చెన్నై జట్టు వీరేంద్ర సెహ్వాగ్ కోసం బిడ్ దాఖలు చేసింది. అయితే సెహ్వాగ్ ను ముఖ్య ఆటగాడిగా తీసుకోవాలని ఢిల్లీ జట్టు భావించి అతడిని కొనుగోలు చేసింది. ఇక అప్పట్లో ఐకాన్ ఆటగాళ్లుగా ఎమ్మెస్ ధోని, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ఎంపికయ్యారు. అయితే ఆ వేలంలో ధోని కోసం అన్ని జట్ల యాజమాన్యాలు పోటీపడ్డాయి. వేలంలో అతడి కోసం ఒక స్థాయిలో యుద్ధం సాగింది.. ప్రతి యాజమాన్యం ధోని కోసం బిడ్ దాఖలు చేసింది. అయితే చెన్నై జట్టు మాత్రం అతడిని కచ్చితంగా కొనుగోలు చేయాలని పట్టుదలను ప్రదర్శించింది. ఈ విషయంలో చెన్నై యజమాని, బీసీసీఐ మాజీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ పట్టుదలను ప్రదర్శించారు. ధోని కోసం బిడ్డింగ్ ఏకంగా ఏడు కోట్లకు చేరుకున్నప్పుడు ముంబై, చెన్నై జట్లు మినహా మిగతావన్నీ వెనక్కి తగ్గాయి. ఒక సందర్భంలో రెండు జట్లు కలిపి 12 కోట్లకు బిడ్ దాఖలు చేశాయి. అయితే చర్చలు అనంతరం చెన్నై ధోనిని సొంతం చేసుకుంది. ఇక అప్పట్నుంచి ధోని చెన్నైకి నాయకత్వం వహిస్తున్నాడు. 2020 సీజన్ మినహా మిగతా అన్నింటిలోనూ చెన్నై జట్టు ప్లే ఆఫ్ కు వెళ్ళింది. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. గత సీజన్లో ధోని కెప్టెన్సీ బాధ్యతకు విశ్రాంతి ఇచ్చి.. తన స్థానంలో రుతు రాజ్ గైక్వాడ్ ను నియమించాడు.