Eknath Shinde : పోతే పోనీ పోరా.. ఈ జగతిలో శాశ్వతమెవరురా.. అని ఓ సినీకవి పాట శారాడు. మహరాష్ట్ర సీఎం.. ఏక్‌నాథ్‌షిండే.. ఇప్పుడు ఇదే పాట పాడుకుంటున్నారు. పోతే పోనీ పోరా.. సీఎం పదవి ఎవరికి శాశ్వతమురా అని ఆలపించాల్సిన పరిస్థితి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్‌సీపీ 41 స్థాల్లో విజయం సాధించాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైనా.. సీఎం ఎవరనే సస్పెన్స్ నాలుగు రోజులుగా కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిని 26వ తేదీన ఖరారు ఏయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో రంగంలోకి దిగిన బీజేపీ పెద్దలు.. ఏక్‌నాథ్‌షిండేను సీఎం రేసు నుంచి తప్పించారు. ఈమేరకు ఒప్పించారు. ఈ విషయాన్ని ఆయనతోనే చెప్పించడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు.
ఎవరైనా ఓకే..
మహారాష్ట్ర సీఎం పదవికి ఎవరిని ఎంపిక నేసినా పరవాలేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే ప్రకటించారు. తాను ఏనాడూ పేరు కోసం పాకులాడలేదని తెలిపారు. బాల్‌థాక్రే ఆశకాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. బుధవారం(నవంబర్ 26న) థానేలోని తన నివాసంలో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం పెద్దను నిర్ణయిస్తారని తెలిపారు. ఆ నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తానని తెలపారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని పేర్కొన్నారు. సీఎం పదవిపై ఆశ లేదని వెల్లడించారు. సీఎం అంటే తన దృష్టిలో కామన్ మ్యాన్ అని తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమని తెలిపారు.
మోదీకి కృతజ్ఞతలు..
ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని అందించిన ఓటర్లకు షిండే కృతజ్ఞతలు తెలిపారు. కూటమికి మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. బాల్ థాక్రే ఆశయంతో ముందుకెళ్తానని తెలిపారు. మోదీ మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. సీఎం అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, రాజకీయాల్లో ఎన్నో ఓడిదుడుకులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. కాబోయే సీఎంను బీజేపీ నేతలు నిర్ణయిస్తారని పునరుద్ఘాటించారు.