Ajinkya Rahane: భారత వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే.. మూడు పార్మాట్స్ ఆడే క్రికెటర్. అయినా 18 నెలలుగా ఏ ఫార్మట్‌లో కూడా జాతీయ జట్టులో స్థానం దక్కడం లేదు. రంజీల్లో బాగా ఆడుతున్నా సెలక్టర్లు ఎంపిక చేయడందు. 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship)ఫైనల్ తర్వాత సెలక్టర్లు రహానేను జాతీయ జట్టుకోలి తీసుకోవడం లేదు. సెలక్టర్ల తీరుపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు జట్టు యాజమాన్యంతో గానీ, సెలక్టర్లతో కానీ కమ్యూనికేషన్ గ్యాప్ లేదని తెలిపాడు. అయినా జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై నిరాశ వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై(Mumbai) తరఫున సెంచరీ సాధించి తన ప్రదర్శనలో కొత్త మెట్టు చేరాడు. జాతీయ జట్టులో అవకాశం దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నాడు. దేశీయ క్రికెట్, ఐపీఎల్‌లో బాగా రాణించానని, అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉంటే 2–3 సిరీస్‌లు వస్తాయని పేర్కొన్నాడు. అయినా దక్షిణాఫ్రికా సిరీస్‌కు తనను ఎంపిక చేయలేదని పేర్కొన్నాడు.
మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాలని..
జట్టులో స్థానం కోసం సెలక్టర్లు, టీం మేనేజ్‌మెంట్(Team Mangement)తో మాట్లాడాలని చాలా మంది తనకు సలహాలు ఇచ్చారని పేర్కొన్నాడు. అయితే అవతలి వ్యక్తి మాట్లాడడానికి సిద్ధంగా లేనందున అలా చేయలేకపోయానని తెలిపాడు. 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత తనను ఎంపిక చేస్తారని భావించినా అవకాశం ఇవ్వలేదని తెలిపాడు.‘నన్ను ఎందుకు తొలగించారు అని అడిగే వ్యక్తిని నేను కాదు. ఎటువంటి కమ్యూనికేషన్(Communication) లేదు. నన్ను తొలగించినప్పుడు నాకు వింతగా అనిపించింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రంజీట్రోఫీలో ముంబై తరఫున సంతృప్తి కర ప్రదర్శన ఇచ్చినా సెలక్టర్ల దృష్టిలోకి రాలేదు.
కీలక ఆటగాడు..
ఇదిలా ఉంటే రహానే భారత్‌కు కీలక ఆటగాడు. అతని మార్గదర్శక పాత్ర, ప్రత్యేకంగా విదేశాల్లో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. తాజాగా జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తిరిగి రావడానికి అవకాశం దొరకడం లేదు. అనుభవం ఉన్న ఆటగాడిగా రహానే ఇప్పటికీ భారత్‌కు సేవలు అందిస్తాడని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.