Lalit Modi comments on Virat Kohli: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఏమాత్రం తగ్గడం లేదు. ఆర్థిక నేరాల కేసులో విదేశాల్లో ఉంటున్న అతడు మన దేశానికి సంబంధించిన ప్రతి వ్యవహారం గురించి మాట్లాడుతున్నాడు. రకరకాల ఇంటర్వ్యూలలో సంచలన విషయాలను బయటకు చెబుతున్నాడు. తద్వారా అతడు నిత్యం మీడియాలో చర్చకు దారి తీస్తున్నాడు.
మొన్నటి దాకా లక్నో యజమాని సంజీవ్ గోయంక మీద లలిత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. అతడు బుద్ధిలేని వ్యక్తి అంటూ.. మూర్ఖుడు అంటూ విమర్శలు చేశాడు. అంతేకాదు, అతడు ఐపీఎల్ లో జట్టు యజమానిగా ఉండేందుకు పనికిరాడు అని స్పష్టం చేశాడు. ఇటీవల కాలంలో లక్నో జట్టు సరిగ్గా ఆడ లేకపోవడంతో.. ఆ లోపాలు కూడా సంజీవ్ ఖాతాలోనే వేశాడు లలిత్.
లలిత్ ఇప్పుడు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మీద పడ్డాడు. పరుగుల యంత్రం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. విరాట్ కోహ్లీ ఆ మధ్య ఒక మ్యాచ్ ఆడేందుకు వెళ్లాడు. అక్కడ అతడి ఆటోగ్రాఫ్ కోసం ఒక బాలుడు ఎదురు చూశాడు. ఆటోగ్రాఫ్ కోసం విరాట్ కోహ్లీ కలిస్తే అతడు ఇవ్వకుండా వెళ్లిపోయాడు.. విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వకపోవడంతో ఆ చిన్నారి విపరీతంగా ఏడ్చాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు లలిత్ ప్రస్తావించాడు.
ఆటోగ్రాఫ్ విరాట్ కోహ్లీ ఇవ్వకపోవడంతో ఆ చిన్నారి విపరీతంగా ఏడ్చాడని ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ వ్యాఖ్యానించాడు. “విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వకపోవడంతో ఆ బాలుడు ఒకసారిగా ఆవేదనకు గురయ్యాడని.. అతడు తీవ్రంగా ఏడ్చాడని.. లలిత్ పేర్కొన్నాడు. ఆ బాలుడిని వెతికి మరి పట్టుకొని.. ఐపీఎల్ సీజన్ వన్ ఆటగాళ్లు మొత్తం సంతకం చేసిన స్పెషల్ బ్యాట్ ను ఇంటికి పంపించారు. ఆ తర్వాత వీడియో కాల్ చేసి.. ఆ పిల్లాడితో చాలాసేపు మాట్లాడానని” లలిత్ పేర్కొన్నాడు. లలిత్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు.
ఇటీవల కాలంలో ఐపీఎల్ గురించి చేదు వాస్తవాలను లలిత్ బయటపెడుతున్నాడు. ఐపీఎల్ రేటింగ్స్ పెంచడానికి ఏం చేస్తాం.. ఆటగాళ్ల విషయంలో ఎటువంటి ప్రణాళికల రూపొందిస్తాం.. మైదానం బయట జరిగే సంఘటనలకు ఎలాంటి స్క్రిప్ట్ రూపొందిస్తాం.. వాటి విషయాలను లలిత్ ఇటీవల వెల్లడించాడు. దీంతో ఐపీఎల్ గురించి.. అందులో జరిగే కోట్ల వ్యాపారం గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత లలిత్ అసలు విషయాలు చెప్పడంతో ఐపీఎల్ గురించి అసలు వాస్తవాలు బయటికి తెలుస్తున్నాయి.
