Bangladesh Vs Afghanistan: అయితే ఇప్పుడు ఆ జట్టు వన్డే లోనూ అదే పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో 3 వన్డేల సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్.. తొలి మ్యాచ్ లో దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలర్ అల్లా ఘజన్ ఫర్ ధాటికి కృప కూలింది. 18 సంవత్సరాల అల్లా ఘజన్ ఫర్ బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ కు చుక్కలు చూపించాడు. 6.3 ఓవర్లు వేసి.. 26 పరుగులు మాత్రమే ఇచ్చి.. 6 వికెట్లు పడగొట్టాడు.. 236 స్వల్ప పరుగులే చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించకుండా అడుగడుగునా అడ్డు తగిలాడు.
ఒకానొక దశలో
ఒకానొక దశలో బంగ్లాదేశ్ జట్టు విజయం దిశగా సాగింది. రెండు వికెట్ల నష్టానికి 120 పరుగుల వద్ద ఉంది. ఈ క్రమంలో అల్లా ఘజన్ ఫర్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో బంగ్లాదేశ్ కథ ఒకసారి గా మారిపోయింది. చూస్తుండగానే వికెట్లు పడిపోయాయి. 23 పరుగుల వ్యవధిలోనే బంగ్లాదేశ్ మిగతా వికెట్లను కోల్పోయింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా లో అల్లా ఘజన్ ఫర్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది..అల్లా ఘజన్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని జుర్మాత్ జిల్లాలో జన్మించాడు.. అతడు ఏకంగా 6.2 అడుగుల పొడవు ఉంటాడు. మొదట్లో పాస్ట్ బౌలింగ్ వేసేవాడు. ఇదే సమయంలో ఆఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ దౌలత్ అహ్మద్ జాయ్ కలిశాడు. అతడికి స్పిన్ బౌలింగ్ ను రుచి చూపించాడు. దీంతో అల్లా ఘజన్ ఫర్ స్పిన్ బౌలర్ గా రూపాంతరం చెందాడు. కోవిడ్ సమయంలో అల్లా ఘజన్ ఫర్ విపరీతంగా క్రికెట్ ఆడాడు. 2023 ఐపీఎల్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఆ సమయంలో అతడు వేలంలో పాల్గొన్న అత్యంత చిన్న వయసు ఉన్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడు తన బేస్ ధరను 20 లక్షలు గా నిర్ణయించాడు. ఆ సమయంలో అతడిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. 2024 సీజన్లో ముజీబ్ ఉర్ రెహమాన్ కు బదులుగా కోల్ కతా జట్టు అల్లా ఘజన్ ఫర్ ను తీసుకుంది.. దీంతో అతడు ఒకసారిగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు తన జాతీయ జట్టును బంగ్లాదేశ్ పై గెలిపించి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
71 పరుగులకే..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 71 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మహమ్మద్ నబీ, కెప్టెన్ హస్మతుల్లా షాహిది బంగ్లా జట్టు బ్యాటింగ్ బారాన్ని మోశారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ బంగ్లాదేశ్ స్కోరును 200 పరుగులు దాటించారు. షాహిది 52, నబి 84 పరుగులు చేశారు. దీంతో ఆఫ్గనిస్తాన్ 49.4 ఓవర్లలో 235 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. అయితే బంగ్లాదేశ్ జట్టు చేజింగ్ లో 143 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. అల్లా ఘజన్ ఫర్ అద్భుతమైన బౌలింగ్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ 92 పరుగుల తేడాతో అనితర సాధ్యమైన విజయాన్ని సాధించింది.