https://oktelugu.com/

MLC Election: ఈసీ నోటిఫికేషన్ వెనక్కి.. అక్కడ ఎన్నికలు లేనట్టే!

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బ్రేక్ పడింది. హైకోర్టు తీర్పుతో ఈసీ నిలిపివేసింది.నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 7, 2024 / 03:56 PM IST

    MLC Election

    Follow us on

    MLC Election: రెండు వ్యవస్థల మధ్య ఇప్పుడు చిన్నపాటి సందిగ్ధత ఏర్పడింది. ఎన్నికల సంఘం విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ దానిని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈసీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే దీనిపై ఎలా ముందుకెళ్లాలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ఈ నెల నాలుగున విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం అయ్యింది. ఈనెల 28న ఓటింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధపడింది. అయితే ఇంతలోనే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటును రద్దు చేసింది. ఆయననే ఎమ్మెల్సీగా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈసీ తన చర్యలను నిలిపివేయాల్సి వచ్చింది.

    * వివరణ తీసుకోకుండానే
    వైసీపీ ఎమ్మెల్సీగా ఉండేవారు ఇందుకూరి రఘురాజు. అయితే ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని మండలి చైర్మన్ మోసేన్ రాజు ఆయనపై అనర్హత వేటు వేశారు. కనీసం ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. హైకోర్టు దానినే తప్పు పట్టింది. అందుకే అనర్హత వేటును రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతుందని భావించిన వైసీపీ హడావిడి చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ను ప్రకటించింది.స్థానిక సంస్థల్లో వైసీపీకి ఏకపక్ష బలం ఉండడంతో తమ అభ్యర్థి విజయం ఖాయమని భావించింది.కానీ వారి ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది.రఘురాజును ఎమ్మెల్సీగా కొనసాగించాలని కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది.

    * రెండు వ్యవస్థల మధ్య
    అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెండు వ్యవస్థల మధ్య యంత్రాంగం నలిగిపోతోంది. అయితే కోర్టు తీర్పు అంతిమం కనుక.. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎన్నికలపై వైసీపీ చాలా రకాలుగా ఆశలు పెట్టుకుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం మాదిరిగానే.. ఇక్కడ కూడా పార్టీ అభ్యర్థి గెలుపొందుతారని అంచనా వేసింది. తమ ఖాతాలో మరో విజయం ఖాయమని భావించింది. కానీ కోర్టు ఆదేశాలతో వారి ఆశలు నీరుగారిపోయాయి.