Odi World Cup 2023: వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లు తుది దశ కి చేరుకున్నాయి. ప్రస్తుతం ఇండియన్ టీం ఒకటే అఫీషియల్ గా సెమీ ఫైనల్ కి క్వాలిఫై అయినప్పటికీ మిగిలిన జట్లు ఏవి కూడా సెమీస్ కి క్వాలిఫై అవ్వలేదు.చిన్న టీం గా వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆఫ్గనిస్తాన్ టీమ్ మాత్రం వరుస విజయాలను అందుకుంటూ ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయానాన్ని రాసుకుంటుంది.
ఇక ఇలాంటి క్రమంలో నిన్న నెదర్లాండ్ పైన జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఘనవిజయం సాధించడం జరిగింది.ఇక దాంతో సెమీఫైనల్ రేసులో భారీ మార్పులు జరిగాయి.ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలిచే వరకు పాకిస్తాన్ టీం నెంబర్ ఫైవ్ పొజిషన్ లో కొనసాగింది కానీ ఆఫ్ఘనిస్తాన్ నెదర్లాండ్ పైన మ్యాచ్ గెలిచి పాకిస్తాన్ టీమ్ ని వెనక్కి నెట్టేసి నెంబర్ ఫైవ్ పొజిషన్ ని ఆక్రమించుకుంది. ఇక ఇలాంటి క్రమంలో ఇండియా ఒకటే సెమీ ఫైనల్ కి క్వాలిఫై అవ్వగా సౌతాఫ్రికా కూడా ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడితే అందులో ఆరు విజయాలను సాధించి మెరుగైన రన్ రెట్ తో సెమీస్ రేస్ లో ముందంజలో ఉంది.
ఇక సౌతాఫ్రికా రేపు ఇండియా తో ఒక మ్యాచ్ ఆడనుంది.ఇక ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచినట్టయితే అఫీషియల్ గా సౌతాఫ్రికా సెమిస్ కి క్వాలిఫై అవుతుంది… ఇక పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 3 పొజిషన్ లో ఆస్ట్రేలియన్ టీం కొనసాగుతుంది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు 6 మ్యాచ్ ల్లో ఆడితే అందులో 4 విజయాలను సాధించింది. అలాగే నెంబర్ ఫోర్ పొజిషన్ లో న్యూజిలాండ్ టీమ్ ఉంది.ఇక న్యూజిలాండ్ టీమ్ కూడా వరుసగా నాలుగు విజయాలను అందుకుని మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలయ్యింది అంటే మొత్తం 7 మ్యాచ్ లు ఆడితే అందులో న్యూజిలాండ్ 4 మ్యాచ్ ల్లో మంచి విజయాలను సాధించి నెంబర్ ఫోర్ లో కొనసాగుతుంది.
ఇక వీళ్ల తర్వాత నెంబర్ ఫైవ్ పొజిషన్ లో ఆఫ్గనిస్తాన్ టీం కొనసాగుతుంది.ఇక అఫ్గాన్ టీమ్ సెమీఫైనల్ లోకి వెళ్ళాలంటే అఫ్గాన్ ఆడే రెండు మ్యాచ్ ల్లో మంచి విజయం సాధించాలి. ముఖ్యంగా అఫ్గాన్ టీమ్ సౌతాఫ్రికా , ఆస్ట్రేలియా టీమ్ ల మీద మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. కాబట్టి ఆ రెండింటి మీద గెలవడం కష్టమనే చెప్పాలి. అయినప్పటికీ వరల్డ్ కప్ లో ఏదైనా జరగొచ్చు. అఫ్గాన్ ఈ మ్యాచులు గెలవడంతో పాటుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండు టీం లు కూడా మిగతా మ్యాచ్ లలో కూడా ఓడిపోయినట్టు అయితే ఆఫ్గనిస్తాన్ టీం కి సెమీస్ కి వెళ్లే అవకాశం వస్తుంది.
ఇక ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ టీం పాకిస్తాన్, ఇంగ్లాండ్,శ్రీలంక లాంటి జట్లకి షాక్ ఇచ్చి తనదైన మార్క్ ను చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుంది… పాకిస్థాన్ టీమ్ ఇవాళ్ల న్యూజిలాండ్ మీద ఆడే మ్యాచ్ లో గెలిస్తే పాకిస్థాన్ కి , అఫ్గాన్ కి కూడా సెమీస్ ఆశలు పదిలం గా ఉంటాయి…ఇక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీం సెమీఫైనల్ లోకి వస్తుందా రాదా అనే విషయాలు తెలియాలి అంటే ఇంకొక రెండు రోజులు వెయిట్ చేయక తప్పదు…