Safety Cars : కారు కొనాలని చాలామందికి ఉంటుంది. కానీ ఈ వెహికల్ కొనేముందు చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. కొందరు తక్కువ ధరలో ఫోర్ వెహికల్ కొనాలని చూస్తే.. మరికొందరు మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లను సొంతం చేసుకోవాలని అనుకుంటారు. ఇంకొందరు మాత్రం Safety గా ఉండే కార్లు కావాలని చూస్తారు. కొన్ని కంపెనీలకు చెందిన కార్లు ప్రత్యేకంగా సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా మరికొన్ని కార్లు ప్రమాదాలకు తక్కువగా గురైన వాటివిగా గుర్తించబడ్డాయి. అయితే ఏ కారు అయినా ప్రమాదానికి గురి కాకుండా ఉండాలంటే రంగుల్లో తేడా ఉండాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంటే కొన్ని రంగుల కార్లు ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నాయని.. మరికొన్ని రంగు రంగుల కార్లు తక్కువ ప్రమాదాలకు గురవుతున్నట్లు తేలాయని పేర్కొంటున్నారు. అయితే ఏ రంగు కార్లు తక్కువ ప్రమాదానికి గురవుతున్నాయో చూద్దాం..
చాలామంది కారు కొనేటప్పుడు తమకు ఇష్టమైన కారును కొనుగోలు చేయాలని చూస్తారు. మరికొందరు తమకు సెంటిమెంట్ గా ఉండే రంగును ఎంచుకుంటారు.అయితే కొన్ని రంగుల కార్లు చీకట్లో కలిసిపోయి కనిపించక ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. మరికొన్ని రంగుల కార్లు dull గా ఉండడంతో ఇవి ఎదుటివారికి కనిపించక సమస్య ఏర్పడుతుంది. ఎక్కువ శాతం మంది కార్ రెడ్ గా ఉంటే షైనింగ్ వస్తుందని.. ఈ కలర్ కారుని ఎంచుకుంటారు. కానీ ఈ కలర్ కారు ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నట్టు తేలింది. ప్రమాదానికి గురయ్యే కార్లలో 60 శాతం రెడ్ కార్లే ఉన్నట్లు తేలింది. అయితే కొన్ని స్పోర్ట్స్ కంపెనీల కార్లు ఎక్కువ సేఫ్టీని ఇచ్చే ఫీచర్లను ఆడ్ చేసి వీటిని తయారు చేస్తారు.
రెడ్ కలర్ తర్వాత బ్రౌన్ కలర్ కార్లు ఎక్కువ ప్రమాదానికి గురైనట్లు తేలింది. ఇది 59% వరకు యాక్సిడెంట్లు గురైనట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక బ్లాక్ కలర్ కార్లు 57% ప్రమాదాలకు గురైనట్లు తేలింది. ఈ రెండు రంగుల కార్లు చీకట్లో ఎక్కువగా కనిపించవు. అందుకే రాత్రి ప్రయాణాల్లో ఒక్కోసారి కారు అని తెలియక ఎదుటి వాహనం డీకొట్టి అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇవి రాత్రి సమయంలో టైర్ గ్రిప్లను కోల్పోయి ప్రమాదాలకు గురవుతాయని పేర్కొంటున్నారు.
Also Read : మార్కెట్లో ఉన్న బెస్ట్ సేప్టీ కార్లు ఏవో తెలుసా? వీటి ధర ఎంతో తెలుసా?
మరి సేఫ్టీ గా ఉండే కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా? వైట్ కలర్ తో పాటు ఎల్లో కలర్ కార్లు అత్యంత సేఫ్టీ అని తేలింది. ఈ రంగులో ఉండే కార్లు తక్కువ ప్రమాదాలకు గురైనట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ రెండు రంగులు శుభసూచకంగా కూడా పనిచేస్తాయని, అందువల్ల ఈ రెండు రంగుల కార్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. అయితే మన దేశంలో ఎల్లో కలర్ కార్లు తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఈ రంగు కార్లను తక్కువ మంది కొనుగోలు చేస్తారు. కానీ వైట్ కలర్ కార్లు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి వైట్ నచ్చకపోయినా సెంటిమెంట్ పరంగా కూడా ఈ కారణం కొనుగోలు చేస్తారు. దీంతో ఈ ప్రమాదాల నుంచి కూడా కాపాడుతాయి.