https://oktelugu.com/

Afghanistan Vs Australia: రెండు వరుస మ్యాచుల్లో హ్యట్రిక్స్ … సన్ రైజర్స్ కెప్టెన్ ఫాం ఓ రేంజ్ లో ఉందిగా!

హ్యాట్రిక్ లు ఎప్పుడో ఒకసారి మాత్రమే చాలా అరుదుగా నమోదు అవుతూ ఉంటాయి. కానీ పాట్ కమ్మిన్స్ మాత్రం ఈ వరల్డ్ కప్ టోర్నీలోనే వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : June 23, 2024 / 09:53 AM IST

    Afghanistan Vs Australia

    Follow us on

    Afghanistan Vs Australia: టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ అయిన పాట్ కమ్మిన్స్ అద్భుతమైన బౌలింగ్ ను కనబరుస్తున్నాడు. ఇతను బౌలింగ్ తో ప్రత్యర్థి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. నిజానికి ఒక బౌలర్ ఒకసారి హ్యాట్రిక్ వికెట్లు తీయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.ఇక కొందరు బౌలర్లు అయితే ఒక మ్యాచ్ మొత్తంలోనే మూడు వికెట్లు తీయలేరు. అలాంటిది వరుసగా మూడు బంతులకు మూడు వికెట్లు తీయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఇలాంటి హ్యాట్రిక్ లు ఎప్పుడో ఒకసారి మాత్రమే చాలా అరుదుగా నమోదు అవుతూ ఉంటాయి. కానీ పాట్ కమ్మిన్స్ మాత్రం ఈ వరల్డ్ కప్ టోర్నీలోనే వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

    ఇక ఇలాంటి ఘనతను సాధించిన ఏకైక బౌలర్ గా కూడా పాట్ కమ్మిన్స్ నిలవడం అనేది ఒక గొప్ప విషయం. ఇక గత మ్యాచ్ లో బంగ్లాదేశ్ పైన హ్యాట్రిక్ వికెట్లను నమోదు చేసుకున్న ఈ పేపర్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ని బెంబేలెత్తించడమే కాకుండా వారిని తక్కువ స్కోరుకు కట్టడం చేయడంలో కూడా తనదైన పాత్రను పోషించాడు. ఇక ఆఫ్గనిస్తాన్ టీమ్ మీద కూడా ఒక హ్యాట్రిక్ అయితే నమోదు చేసుకున్నాడు. 18 ఓవర్ చివరి బంతికి రషీద్ ఖాన్ ను అవుట్ చేసిన కమ్మిన్స్ 20 ఓవర్ మొదటి బంతికి కారమ్ జనత్ ను పెవిలియన్ కి పంపాడు.

    ఇక ఆ తర్వాత బంతికే గుల్బాదిన్ ను ఔట్ చేశాడు. ఇక ఈ ఓవర్ లో మూడో బంతికి కరోటే ఇచ్చిన క్యాచ్ ను వార్నర్ వదిలేశాడు. లేకపోతే వరుసగా నాలుగు వికెట్లు తీసిన బౌలర్ గా కమ్మిన్స్ మంచి గుర్తింపును సంపాదించుకునేవాడు. ఇక మొత్తానికైతే కమ్మిన్స్ ఈ మ్యాచ్ లో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు…ఇక ఆయన దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ టీం నిర్ణీత 20 ఓవర్లకి 6 వికెట్లను కోల్పోయి 148 పరుగులు చేసింది.

    ఇక టి 20 వరల్డ్ కప్ ఒకే టోర్నీలో రెండు సార్లు హ్యాట్రిక్ తీసిన బౌలర్ గా కమ్మిన్స్ చరిత్రలో నిలిచిపోయాడు.ఇక ఇప్పటివరకు టి20 లో కమ్మిన్స్ కాకుండా రెండుసార్లు హ్యాట్రిక్ లను సాధించిన బౌలర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే లసిత్ మలింగా (శ్రీలంక), టీమ్ సౌదీ (న్యూజిలాండ్),మార్క్ ఫాల్వోవీక్ (సెర్బియా), వసీమ్ అబ్బాస్ (సెల్టా)ఇక ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లో 8 సార్లు హ్యాట్రిక్ లు నమోదు అయితే అందులో రెండు సార్లు పాట్ కమ్మిన్స్ వే ఉండడం విశేషం…