AP Pensions: 1న పింఛన్ల పండగ.. భారీగా ప్లాన్ చేస్తున్న కూటమి నేతలు

ఈ ఎన్నికల్లో పింఛన్ల అంశం ప్రధాన హామీగా మారింది. రాము అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని 3,500 పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. అది కూడా రెండు విడతల్లో 250 చొప్పున పెంచుతామని చెప్పుకొచ్చారు.

Written By: Dharma, Updated On : June 23, 2024 10:03 am

AP Pensions

Follow us on

AP Pensions: ఏపీలో కొత్త ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఫైల్ పై చంద్రబాబు సంతకం చేసిన సంగతి తెలిసింది. ఈనెల నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ లబ్ధిదారులకు అందం ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏప్రిల్ నుంచి ఈ పెంపుదల వర్తింపజేయనున్నారు. నాలుగు వేల రూపాయల పింఛన్ మొత్తం తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెల కు సంబంధించి పెండింగ్ మూడు వేల రూపాయలు అందించనున్నారు. మొత్తంగా కలిపి రూ.7000 పింఛన్ లబ్ధిదారులకు అందనుంది. అయితే వాలంటీర్లతో పంపిణీ చేయాలా? ప్రభుత్వ సిబ్బందితో అందించాలా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.

ఈ ఎన్నికల్లో పింఛన్ల అంశం ప్రధాన హామీగా మారింది. రాము అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని 3,500 పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. అది కూడా రెండు విడతల్లో 250 చొప్పున పెంచుతామని చెప్పుకొచ్చారు.అయితే చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు పెండింగ్ మొత్తాన్ని కూడా జూలైలో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో జూలై 1న పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతూ అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కొత్త పింఛన్ పుస్తకాలతో పాటు నగదు అందించాలని ఆదేశించారు.

వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు ₹4,000 పింఛన్ అందునుంది. అదేవిధంగా ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు 4000 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులకు మూడు వేల నుంచి 6 వేలకు, పూర్తిస్థాయి దివ్యాంగులకు ఐదు నుంచి 15 వేలకు పింఛన్ మొత్తాన్ని పెంచనున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఐదు వేల నుంచి పదివేలకు పింఛన్ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల ఒకటి నుంచి ఈ పెంపుదల అమలు కానుంది. అయితే ఈ పింఛన్లను వాలంటీర్ల ద్వారా అందించాలా? లేకుంటే సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలా అన్నది ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 24న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఈనెల పెన్షన్లకు సంబంధించి ఎటువంటి నగదు సమస్య లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జూలై 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూటమి నేతలు ఆలోచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వేదిక ఖరారు చేయనున్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.