Homeక్రీడలుIndia Vs Australia WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కొత్త జెర్సీ.. స్పెషల్‌ వీడియో...

India Vs Australia WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కొత్త జెర్సీ.. స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసిన అడిడాస్‌

India Vs Australia WTC Final 2023: వరల్డ్‌ టెస్ట్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2023కి ముందు, టీమిండియా కొత్త జెర్సీని అడిడాస్‌ విడుదల చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు తొలిసారిగా ఈ జెర్సీని ధరించి, బరిలోకి దిగనుంది. జూన్‌ 7 నుంచి భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది.

టీమిండియా స్పాన్సర్‌గా..
అడిడాస్‌ భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కిట్‌ స్పాన్సర్‌గా ఇటీవల మారిన సంగతి తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు, అడిడాస్‌ ఇండియా టీమ్‌ ఇండియా కొత్త జెర్సీలను గురువారం సాయంత్రం విడుదల చేసింది. టెస్ట్, వన్డే, టీ20 ఇంటర్నేషనల్‌ అనే మూడు ఫార్మాట్‌ల కోసం కొత్త జెర్సీలను రూపొందించింది. ఈమేరకు రూపొందించిన వీడియోను అడిడాస్‌ ఇండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రాగామ్‌ ఖాతా ద్వారా షేర్‌ చేసింది. ఈ మేరకు ‘ఇది ఐకానిక్‌ మూమెంట్‌. ఒక ఐకానిక్‌ స్టేడియం. కొత్త టీమ్‌ ఇండియా జెర్సీని పరిచయం చేస్తున్నాం’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ముంబైలోని ఐకానిక్‌ వాంఖడే స్టేడియం నుంచి ఈ జెర్సీ బయటకు వస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ మైదానంలో భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

కొత్త జెర్సీతో డబ్ల్యూటీసీ ఫైనల్‌..
జూన్‌ 7 నుంచి జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు తొలిసారి కొత్త జెర్సీని ధరించనుంది. డబ్ల్యూటీసీ – 2023 ఫైనల్‌ మ్యాచ్‌ లండన్‌లోని ఓవల్‌లో జరుగుతుంది. ఈ జెర్సీకి ముందు, అడిడాస్‌ రూపొందించిన కొత్త కిట్‌లో టీమ్‌ ఇండియా ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించింది. వన్డే, టీ20 ఇంటర్నేషనల్‌ కోసం వివిధ జెర్సీలు కూడా విడుదల చేశారు. రెండింటి రంగు నీలం అయినప్పటికీ, కొంత వ్యత్యాసం ఉంది. ఇక టెస్ట్‌ కోసం తెలుపు రంగు జెర్సీని విడుదల చేశారు.

గతంలో వన్డే వరల్డ్‌ కప్‌ టైంలోనే మార్పు..
టీమిండియాకు సహారా ఇండియా చాలాకాలం స్పాన్సర్‌షిప్‌గా ఉంది. దీంతో జెర్సీ మార్పును మూడు నాలుగు ఏళ్లకు ఒకసారి మార్చేది. అది కూడా రంగుల్లో స్వల్ప తేడా మాత్రమే ఉండేది. ప్రధానంగా వన్డే వరల్డ్‌ కప్‌ టైంలో జెర్సీని మార్చడం ఆనవాయితీగా వచ్చింది. సహారా తప్పుకున్న తర్వాత మారుతున్న స్పాన్సర్‌షిప్‌ యాజమాన్యాలు కొత్త తరహాలో జెర్సీలు రూపొందిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version