India Vs Australia: మళ్లీ అదే ఇబ్బంది.. అదే చెత్త బ్యాటింగ్.. బంతులు ఎదుర్కోవడంలో తడబాటు.. పరుగులు తీయడంలో అవస్థ.. ఇదిగో ఇలా సాగిపోయింది రెండో వన్డే లోనూ టీమిండియా కెప్టెన్ గిల్ బ్యాటింగ్. పోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మార్ష్ అదరగొడుతుంటే.. గిల్ మాత్రం నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అనమక ఆటగాడి లాగా ఆడుతున్నాడు. అసలు అలా ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నాడో? అలా ఎందుకు నిర్లక్ష్యంగా అవుట్ అవుతున్నాడో.. అర్థం కాని పరిస్థితి.
వన్డే జట్టుకు నాయకుడిని చేసి.. భవిష్యత్తు కాలంలో గొప్ప గొప్ప విజయాలు అందిస్తాడని మేనేజ్మెంట్ భావిస్తే.. గిల్ మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నాడు. కోచ్ గౌతమ్ గంభీర్ అండదండలు గిల్ కు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. టీమిండియా విజయాలలో ముఖ్యపాత్ర పోషించాల్సిన గిల్.. ఇలా ఆడుతుండడాన్ని సగటు భారత క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు.. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ ను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కష్టకాలంలో జట్టును ఆదుకున్నాడని.. ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడని.. ఉప సారధిగా కీలకమైన ఇన్నింగ్స్ ఆడి అదర కొట్టాడని అభిమానులు పేర్కొంటున్నారు.
17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో మైదానంలోకి అయ్యర్ వచ్చాడు. ఈ క్రమంలో 61 పరుగులు చేశాడు. మూడో వికెట్ కు రోహిత్ శర్మతో కలిసి ఏకంగా 118 పరుగులు చేశాడు. తద్వారా ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఉన్నంత సేపు మైదానంలో చురుకుగాక కదిలాడు అయ్యర్. 77 బంతుల్లో ఏడు బౌండరీల సహాయంతో 61 పరుగులు చేశాడు అయ్యర్. జంప బౌలింగ్లో ఊహించని స్థాయిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినప్పటికీ టీమ్ ఇండియా అప్పటికే పటిష్ట స్థితిలో ఉంది..
ఇటీవల కాలంలో అయ్యర్ కు జట్టులో స్థిరమైన అవకాశాలు లభించడం లేదు.. దీంతో అతడు జట్టులోకి రావడం, పోవడం జరిగిపోతున్నాయి. వాస్తవానికి అతడు ఐపిఎల్ లో అదరగొట్టాడు. అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. కానీ అతడిని గుర్తించడంలో గంభీర్ విఫలమవుతున్నాడు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ మనసులో ఏదో పెట్టుకుని అతడిని ఇబ్బంది పెడుతున్నాడు. కానీ వచ్చిన అవకాశాలను మాత్రం అయ్యర్ సద్వినియోగం చేసుకుంటున్నాడు. తాజా ఇన్నింగ్స్ కూడా అలాంటిదే. ఇప్పటికైనా గంభీర్ తన మనసు మార్చుకుంటాడా.. అయ్యర్ ను అద్భుతమైన ఆటగాడిగా గుర్తిస్తాడా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.