https://oktelugu.com/

Actor Ajay: చేయి పట్టుకోగానే ఆ హీరోయిన్ అలా అనేసింది..ఆ తరువాత విపరీతంగా బాదేసిందన్న స్టార్ నటుడు..

సినిమాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ హీరో కావాలని ప్రతి ఉంటుంది. కానీ హీరో కావడానికి ఆవగింజంత అదృష్టమైన ఉండాలి.. లేదా సినీ బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి.. చాలామంది ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అని ఇండస్ట్రీకి వచ్చారు.. హీరో కావాలని ఆశ పడ్డారు. కానీ అవకాశాలు రావడంతో క్యారెట్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.

Written By: , Updated On : June 2, 2023 / 10:58 AM IST
Actor Ajay

Actor Ajay

Follow us on

Actor Ajay: ఒకప్పుడు ప్రతి సినిమాలో రేప్ సీన్ పెట్టేవారు. ఈ సీన్ చేయడానికి, ఇందులో నటించడానికి ఇబ్బందులు ఉన్నా.. సినిమాను దృష్టిలో పెట్టుకొని కొందరు డైరెక్టర్లు కచ్చితంగా ఈ సీన్లను పెట్టేవారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఓ రేప్ సీన్ చేసేటప్పుడు నటుడు అజయ్ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆయన ఇప్పుడు బయట పెట్టాడు. అజయ్ లేటెస్ట్ గా చక్రవ్యూహం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి

సినిమాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ హీరో కావాలని ప్రతి ఉంటుంది. కానీ హీరో కావడానికి ఆవగింజంత అదృష్టమైన ఉండాలి.. లేదా సినీ బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి.. చాలామంది ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అని ఇండస్ట్రీకి వచ్చారు.. హీరో కావాలని ఆశ పడ్డారు. కానీ అవకాశాలు రావడంతో క్యారెట్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.

విలన్ గా పలు పాత్రలు పోషించి ఆ తర్వాత సహాయ నటుడిగా సినిమాల్లో నటిస్తున్న అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విభిన్న శైలిలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి తీసిన విక్రమార్కుడు సినిమాలో టిట్ల పాత్ర ద్వారా ఫేమస్ అయిన అజయ్ ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా, కామెడీ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. సారాయి వీర్రాజు అనే సినిమాలో హీరోగా నటించి తన కలను నెరవేర్చుకున్నాడు. కానీ ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో ఇతర పాత్రలను చేసుకుంటూ పోతున్నాడు. లేటెస్ట్ గా ఆయన చక్రవ్యూహం అనే సినిమాలో నటించారు. ఇందులో ఆయనది కీలక పాత్ర. ఈ సందర్భంగా తన సినీ కెరీర్లో జరిగిన ఓ సీన్ గురించి చెప్పిన విషయం ఆసక్తిగా మారింది.

శ్రీహరి హీరోగా నటించిన ఓ సినిమాలో అజయ్ విలన్ గా నటించారు. ఇందులో ఓ రేప్ సీన్ ఉంటుంది. అయితే షూటింగ్లో రేప్ సీన్ తీసే క్రమంలో అజయ్ హీరోయిన్ చేయి పట్టుకోగానే ఆమె రిజెక్ట్ చేసింది. తనను ముట్టుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనితో అజయ్ షాక్ అయ్యాడు. అదేంటీ… రేప్ సీన్ గురించి తనకు చెప్పలేదా? అని అజయ్ లోపల అనుకున్నాడు. ఆ తర్వాత తేలిన విషయం ఏంటంటే ఆమె ఇలాంటి సీన్లను ఒప్పుకోలేదట. ఆమె అలా అనేసరికి ఎంతో బాధించిందని అజయ్ చెప్పాడు. దీంతో అప్పటినుంచి రేప్ సీన్లను చేయొద్దని నిర్ణయించుకున్నాడట.