India Vs Bangladesh: టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అనుకూలమైన ఫలితాన్ని సాధించింది. బంగ్లాదేశ్ విధించిన లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. తద్వారా ఐదు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. దీంతో టీమ్ ఇండియా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ విజయం ద్వారా టీమ్ ఇండియాలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. సెమీఫైనల్ వెళ్లడానికి టీమ్ ఇండియాకు ఈ విజయం సరిపోతుందా.. ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి అభిమాని నోటి నుంచి వినిపిస్తోంది.
టీమిండియా ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. వాస్తవానికి గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయి సెమీఫైనల్ అవకాశాలను చాలా వరకు సంక్లిష్టం చేసుకుంది. దీంతో టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో జరిగే మ్యాచ్లో భారీ అంతరంతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తన స్థాయి ఆట తీరు ప్రదర్శించలేకపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేసింది.. నిర్ణీత 20 ఓవర్ల పాటు టీమ్ ఇండియా బౌలర్లను బంగ్లాదేశ్ బ్యాటర్లు ప్రతిఘటించారు. 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేశారు. వాస్తవానికి బంగ్లాదేశ్ స్థాయిలో పరుగులు చేసిందని ఎవరూ ఊహించలేదు. బంగ్లాదేశ్ జట్టులో జూయారియా 33, సుల్తానా 32 పరుగులు చేశారు. ఎప్పటిలాగే మన చరణి అద్భుతంగా బౌలింగ్ చేసింది. నాలుగు ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టింది. రాధా యాదవ్ 4 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు పడగొట్టింది. రేణుక సింగ్ ఒక వికెట్.. నందిని శర్మ ఒక వికెట్ సాధించారు.
137 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన భారత జట్టు 16.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది. టీమిండియాలో ఈసారి ఓపెనర్ స్మృతి మందాన దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. కేవలం ఎన్ని పరుగులు మాత్రమే చేసింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ 53 పరుగులు చేసి అదరగొట్టింది. యాస్తిక భాటియా 23.. జెమీమా 26 పరుగులతో సత్తా చూపించారు. వాస్తవానికి ఈ టార్గెట్ టీమ్ ఇండియా 12 ఓవర్లలో ఫినిష్ చేసి ఉంటే నెట్ రన్ రేట్ మరింత పెరిగేది. అలాంటప్పుడు ఆస్ట్రేలియాతో తదుపరి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ టీమిండియా సెమీఫైనల్ లాగా వెళ్ళేది. కానీ టీమిండియా బ్యాటర్లు మధ్య ఓవర్లలో నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం.. మెరుగైన ఆరంభం లభించకపోవడంతో 17 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఐదు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించడంతో.. టీమ్ ఇండియాకు అనుకున్న స్థాయిలో నెట్ రన్ రేట్ సాధ్యం కాలేదు.
ఇప్పటికే గ్రూప్ ఎ లో ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో తిరుగులేని స్థానంలో ఉంది. సెమి ఫైనల్ దాకా వెళ్ళిపోయింది. ఇండియా ఖాతాలో 6 పాయింట్లు ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడం వల్ల ఇప్పటికి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోలేకపోతోంది. టీమిండియా మరో మాటకు తావు లేకుండా సెమీఫైనల్ వెళ్లాలంటే కచ్చితంగా ఆస్ట్రేలియా మీద గెలవాలి. అప్పుడే గ్రూప్ ఎలో ఆస్ట్రేలియా, భారత సెమీఫైనల్ వెళ్తాయి. గ్రూప్ బి లో ఇంగ్లాండ్ సెమీఫైనల్ వెళ్ళిపోయింది. వెస్టిండీస్ కూడా సెమి ఫైనల్ దారిలో ఉంది..
టీమిడియా ఖాతాలో ప్రస్తుతం +2.268 నెట్ రన్ రేట్ ఉంది. దక్షిణాఫ్రికా ఖాతాలో -0.546 నెట్ రన్ రేట్ ఉంది. దక్షిణాఫ్రికా నెదర్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లు కూడా దక్షిణాఫ్రికాకు పోటీ ఇచ్చేంత స్థాయి కాదు కాబట్టి.. కచ్చితంగా అందులో ఆ జట్టుకు అనుకూలమైన ఫలితమే వస్తుంది. అలాంటప్పుడు టీమిండియా ఆస్ట్రేలియా మీద ఖచ్చితంగా గెలవాలి. అప్పుడే సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
