Abhishek Sharma : పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత అభిషేక్ శర్మ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ అభినందించింది. ప్రశంసలతో ముంచెత్తింది. అద్భుతంగా ఆడావంటూ కీర్తించింది. ముఖ్యంగా అభిషేక్ సెంచరీ చేసిన తర్వాత కావ్య ఆనందం ఆకాశాన్ని తాకింది. మ్యాచ్ గెలిచిన తర్వాత అభిషేక్ శర్మ తల్లిదండ్రులతో తన సంబరాన్ని షేర్ చేసుకుంది. అంతేకాదు అభిషేక్ శర్మ తల్లితో అయితే కావ్య చాలాసేపు మాట్లాడింది. సాధారణంగా అంతర్ముకురాలిగా ఉండే కావ్య.. ఇలా ఒక్కసారిగా స్పందించడం మీడియాలో కూడా ప్రముఖంగా చర్చకు కారణమవుతోంది.
Also Read : పంజాబ్ పై అతిపెద్ద సిక్స్ కొట్టిన అభిషేక్.. వైరల్ వీడియో
మ్యాచ్ గెలిచిన తర్వాత….
మ్యాచ్ గెలిచిన తర్వాత అభిషేక్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన సంబరాలలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన తోటి ఆటగాడు హెడ్ తో కలిసి హైదరాబాద్ యాజమాన్యం తీసుకువచ్చిన కేక్ ను కట్ చేశాడు. ఆ తర్వాత తోటి ఆటగాళ్లతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. మైదానం నుంచి ప్రత్యేకమైన బస్సులో హోటల్ వద్దకు వెళ్ళిన తర్వాత.. అభిషేక్ శర్మకు సన్ రైజర్స్ హైదరాబాద్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. దీంతో అతను ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు. అతడు బస్సు దిగడమే ఆలస్యం.. ఎదురుగా అతని తల్లిదండ్రులు స్వాగతం పలికారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన తల్లిని గట్టిగా హత్తుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆమె కూడా కొడుకు సాధించిన విజయాన్ని చూసి గర్వంతో ఉప్పొంగిపోయింది. ఇక హోటల్ రూమ్ లో అభిషేక్ శర్మతో కలిసి అతని తల్లిదండ్రులు చాలా సేపు గడిపారు. అతడిని గుండెలకు హత్తుకొని ప్రేమతో ముద్దులు పెట్టారు.. అంతకుముందు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత.. ఆ జ్ఞాపికలను తన తల్లిదండ్రులకు ఇచ్చి అభిషేక్ శర్మ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ గా మారిపోయాయి. మొత్తానికి పంజాబ్ జట్టు పై చేసిన వీరోచితమైన పరుగులు అభిషేక్ శర్మను మరోసారి ఓవర్ నైట్ స్టార్ ను చేసేసాయి.. ఇక నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు ట్విట్టర్లో అభిషేక్ శర్మ ట్రెండింగ్లో కొనసాగుతూ ఉండడం విశేషం. “డ్రెస్సింగ్ రూమ్ లో ఏర్పాటు చేసిన కేక్ వేడుక లో హైదరాబాద్ ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. హెడ్, అభిషేక్ శర్మ కలిసి కేక్ కట్ చేశారు. వారిద్దరూ మైదానంలో విధ్వంసాన్ని సృష్టించారు కాబట్టి.. ఈ ఆనందానికి వారిద్దరే మూల కారకులు. ఇలాంటి వ్యక్తులు మరిన్ని విజయాలు సాధించాలి. వారి జట్టుకు మరింత పేరు తీసుకురావాలి. ఇకపై ఓటములు అనేవి లేకుండా.. దూకుడుగా ఆడితే మాత్రం హైదరాబాద్ జట్టు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని” సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Abhishek Sharma hugging his mother after the iconic innings pic.twitter.com/r5pazWZhzT
— Johns. (@CricCrazyJohns) April 13, 2025