Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma : పంజాబ్ పై అతిపెద్ద సిక్స్ కొట్టిన అభిషేక్.. వైరల్ వీడియో

Abhishek Sharma : పంజాబ్ పై అతిపెద్ద సిక్స్ కొట్టిన అభిషేక్.. వైరల్ వీడియో

Abhishek Sharma : హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) బ్యాటర్ల సిక్సర్ల సంబరానికి వేదికైంది. పంజాబ్‌ కింగ్స్‌ నిర్దేశించిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఎస్‌ఆర్‌హెచ్, అభిమానులను ఉర్రూతలూగించింది. ఐసీఎల్‌ సీజన్‌ – 18లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండుగ చేసింది. భారీ స్కోర్ల ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్స్‌ మెన్స్‌ భారీ షాట్లతో అలరించారు.

Also Read : అభిషేక్ శర్మ నోట్ ఎందుకు బయటకు తీశాడంటే.. బాంబు పేల్చిన హెడ్!

ఉప్పల్‌ మ్యాచ్‌లో సిక్లర మోత మోగింది. ఎస్‌ఆర్‌హెచ్, పంజాబ్‌ కింగ్‌స మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌లు సిక్సర్ల సునామీ సృష్టించారు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ల విధ్వంసక బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌ ఐపీఎల్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ముఖ్యంగా ట్రావిస్‌ హెడ్‌ కొట్టిన కళ్లు చెదిరే సిక్సర్లు మైదానంలో సంచలనం సృష్టించాయి.

సూపర్‌ సిక్స్‌..
ఈ మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ ఆడిన ఒక సిక్సర్‌ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. జాన్సన్‌ వేసిన పదో ఓవర్‌లో లాంగ్‌ ఆన్‌మీదుగా హెడ్‌ కొట్టిన సిక్స్‌ దాదాపు 106 మీటర్ల దూరం ప్రయాణించి, ఈ సీజన్‌లో అత్యంత దూరం వెళ్లిన సిక్సర్లలో ఒకటిగా నిలిచింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో వచ్చిన ఒక బంతిని హెడ్‌ లాఫ్టెడ్‌ కవర్‌ డ్రైవ్‌తో మైదానం బయటకు పంపాడు. ఈ సిక్స్‌ దూరం, ఎత్తు, టైమింగ్‌ అన్నీ కలిసి అభిమానులను ఉర్రూతలూగించాయి. అభిషేక్‌ శర్మ కూడా తన వంతు సహకారంతో 90 మీటర్లకు పైగా ప్రయాణించిన సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి, విజయానికి బలమైన పునాది వేసింది.

బ్యాటింగ్‌ దూకుడు
సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో తమ బ్యాటింగ్‌ దూకుడును చాటుకున్నారు. అభిషేక్‌–హెడ్‌ జోడి ఆరంభంలోనే పంజాబ్‌ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ జోడి మొదటి 10 ఓవర్లలోనే 150కి పైగా పరుగులు సాధించడంతో, లక్ష్య ఛేదన సులభమైంది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ, ‘‘మా శైలికి సరిపోయే ఆటతీరును ప్రదర్శించాం. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మా బ్యాటర్లు రిస్కీ షాట్లతో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. అభిమానుల సపోర్ట్‌ అద్భుతంగా ఉంది,’’ అని అన్నాడు.

ఈ మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ బలాన్ని, ఆట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. ట్రావిస్‌ హెడ్, అభిషేక్‌ శర్మల సిక్సర్ల వర్షం, కెప్టెన్‌ కమిన్స్‌ వ్యూహాత్మక నాయకత్వం జట్టును ఈ చారిత్రాత్మక విజయానికి నడిపించాయి. మాక్స్‌వెల్‌తో జరిగిన చిన్న ఘర్షణ ఆటలో భాగమేనని, అది జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదని హెడ్‌ స్పష్టం చేశాడు. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఐపీఎల్‌ 2025లో తమ ఖాతాలో కీలక పాయింట్లను జమ చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular