https://oktelugu.com/

Abhishek Sharma : పాపం అభిషేక్.. బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయాడు.. జట్టులో భవితవ్యం ఏమిటో?

ఐపీఎల్ లో హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తుఫాన్ లాంటి బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో అతడిని t20 ఫార్మాట్ లోకి ఎంపిక చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 9, 2024 / 04:36 PM IST

    Abhishek Sharma

    Follow us on

    Abhishek Sharma : జాతీయ జట్టులో స్థానం లభించిన తర్వాత అభిషేక్ శర్మ జింబాబ్వే తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కానీ ఆ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో, తనకు వచ్చిన అవకాశాలను అభిషేక్ శర్మ వినియోగించుకోలేకపోతున్నాడు. యువరాజ్ సింగ్ కు అత్యంత ప్రియమైన శిష్యుడైనప్పటికీ.. జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించలేక విఫలమవుతున్నాడు. ఒకప్పుడు కేజీఎఫ్ లో రాఖీ పాత్రధారి కి ఇచ్చిన ఎలివేషన్ లాగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేసేవాడు. జింబాబ్వేతో జరిగిన సిరీస్ లో తొలి మ్యాచ్ లో సున్నా పరుగులకు అవుట్ అయిన అభిషేక్ .. ఆ తర్వాత మ్యాచ్లో సెంచరీ చేశాడు. అయితే అనంతరం తాను ఆడిన ఆరు మ్యాచ్లలో అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. ఇందులో అతని హైయెస్ట్ స్కోర్ 16 మాత్రమే అంటే.. అతని బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గౌతమ్ గంభీర్ టీం ఇండియా కోచ్ అయిన తర్వాత.. భారత జట్టు శ్రీలంకలో పర్యటించింది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడింది. అయితే ఆ సిరీస్ లో అభిషేక్ శర్మకు అవకాశం లభించలేదు.

    అదే తడబాటు

    టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో చోటు దక్కించుకోవాలని భావిస్తోంది. తద్వారా తొలిసారి టెస్ట్ గదను అందుకోవాలని అనుకుంటున్నది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్, గిల్ ను రెడ్ బాల్ క్రికెట్ కు పరిమితం చేసింది. దీంతో అభిషేక్ శర్మకు అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవలి బంగ్లాదేశ్ సిరీస్లో అభిషేక్ శర్మకు అవకాశం లభించింది. కానీ అతడు మూడు మ్యాచ్లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. చివరికి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్ తొలి మ్యాచ్ లోనూ అదే వైఫల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కేవలం ఏడు పరులు మాత్రమే చేసి అతడు అవుట్ అయ్యాడు.. వాస్తవానికి రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. ఓపెనర్ స్థానం దశాబ్దం అనంతరం ఖాళీ అయింది. ఆ స్థానంలో అభిషేక్ శర్మ భర్తీ అవుతాడనుకుంటే.. అతడు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. సెలక్టర్లు, బీసీసీఐ పెద్దలు అవకాశాలు ఇస్తున్నప్పటికీ అతడు ఉపయోగించుకోలేకపోతున్నాడు. దీంతో ఆస్థానానికి యశస్వి జైస్వాల్ ఓకే అయ్యాడు. ఇక మిగిలిన ఒక స్థానం కోసం గిల్, సంజు, రుతు రాజ్ గైక్వాడ్ పోటీ పడుతున్నారు. అయితే రుతురాజ్ కు ఆశించినంత స్థాయిలో అవకాశాలు లభించడం లేదు. గిల్ రెడ్ బాల్ క్రికెట్ తో బిజీ అయిపోయాడు. ఈ దశలో తన స్థానాన్ని అభిషేక్ శర్మ సుస్థిరం చేసుకోవచ్చు. కానీ అతడు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మరోవైపు సంజు వీరోచితమైన బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 10 సిక్స్ లు కొట్టాడు. రోహిత్ శర్మ రికార్డుకు సమంగా వచ్చాడు. భవిష్యత్తు కాలంలో అతడు ఇదే జోరు కొనసాగిస్తే రోహిత్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.