Amaran Movie Collections : తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘అమరన్’ చిత్రం ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకి దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. విక్రమ్ చిత్రం తర్వాత కమల్ హాసన్ నిర్మాతగా అందుకున్న రెండవ భారీ బ్లాక్ బస్టర్ చిత్రమిది. తమిళనాడు లో నిన్న మొన్నటి వరకు సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్, అజిత్ వంటి వారికి మాత్రమే రికార్డు స్థాయి వసూళ్లు వస్తూ ఉండేవి. ఇప్పుడు ఆ జాబితాలోకి శివ కార్తికేయన్ కూడా చేరిపోయాడు. తమిళనాడులో శివ కార్తికేయన్ పాపులర్ హీరో కాబట్టి, ఆయన సినిమాలు యావరేజ్ గా ఉన్నా ఆడేస్తాయి. కానీ తెలుగులో కూడా ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మ రథం పడుతున్నారు. ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా లాంగ్ రన్ లో కూడా ఈ చిత్రానికి స్టడీ వసూళ్లను అందిస్తున్నారు.
9 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం 9 వ రోజు ఈ చిత్రానికి ‘లక్కీ భాస్కర్’ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయట. ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి 9వ రోజు 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, ‘అమరన్’ చిత్రానికి 9 వ రోజు 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి 9 రోజుల్లో 14 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నైజాం ప్రాంతం లో 6 కోట్ల 50 లక్షలు, ఆంధ్ర ప్రాంతంలో 5 కోట్ల 66 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో రెండు కోట్ల 8 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా బయ్యర్స్ కి 8 కోట్ల 75 లక్షల రూపాయిల లాభాలు ఇప్పటి వరకు వచ్చిందన్నమాట.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు లో 94 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక లో 12 కోట్ల 20 లక్షలు, కేరళలో 6 కోట్ల 45 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి 9 రోజుల్లో 56 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా 9 రోజుల్లో ఈ చిత్రానికి 194 కోట్ల రూపాయిల గ్రాస్, 96 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేటితో ఈ చిత్రం 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాతుంటుందని, ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తుంది. శివ కార్తికేయన్ లాంటి మీడియం రేంజ్ హీరో కి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు అంటున్నారు ట్రేడ్ పండితులు.