https://oktelugu.com/

Lucky Bhaskar Movie Collections : 100 కోట్ల వైపు దూసుకుపోతున్న ‘లక్కీ భాస్కర్’..9 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

విడుదలైన మొదటి రోజు నుండి అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టింది?, ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనే అంశం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే దుల్కర్ తెలుగు లో నటించిన 'సీతారామం' చిత్రం 98 కోట్ల రూపాయిల గ్రాస్ వద్ద ఆగిపోయింది.

Written By: Vicky, Updated On : November 9, 2024 4:16 pm

Lucky Bhaskar Movie Collections

Follow us on

Lucky Bhaskar Movie Collections :  మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన నాల్గవ చిత్రం ‘లక్కీ భాస్కర్’. అంతకు ముందు ఆయన తెలుగులో ‘మహానటి’, ‘సీతారామం’, ‘కల్కి’ వంటి చిత్రాల్లో నటించాడు. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న తర్వాత, ఆయన చేసిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం కూడా పెద్ద హిట్ అవ్వడంతో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. వివిధ రకాల విభిన్నమైన పాత్రలు పోషిస్తూ దుల్కర్ సల్మాన్ యూత్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. విడుదలైన మొదటి రోజు నుండి అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టింది?, ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనే అంశం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే దుల్కర్ తెలుగు లో నటించిన ‘సీతారామం’ చిత్రం 98 కోట్ల రూపాయిల గ్రాస్ వద్ద ఆగిపోయింది. అలా ఈ ‘లక్కీ భాస్కర్’ చిత్రం వంద కోట్లు కొట్టకుండా థియేట్రికల్ రన్ ఆగకూడదని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలై నిన్నటితో 9 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 9 రోజులు ఎంత వసూళ్లను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. 8వ రోజు ఈ సినిమాకి 49 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 9 వ రోజు 54 లక్షల రూపాయిలు వచ్చింది. చూస్తుంటే ఈరోజు, రేపు కలిపి ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రాంతాల వారీగా 9 రోజుల్లో వచ్చిన వసూళ్లను చూస్తే నైజాంలో 7 కోట్ల 26 లక్షల రూపాయిలు, సీడెడ్ లో 2 కోట్ల రూపాయిలు, ఆంధ్ర ప్రదేశ్ లో 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సీడెడ్ లో ఇంకో 50 లక్షల రూపాయిలు వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని ఆ ప్రాంతంలో అందుకుంటుంది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 9 రోజులకు 15 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 25 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.

ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కేరళలో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తమిళనాడు లో 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. సినిమాకి బాగా డిమాండ్ పెరగడంతో రెండవ వీకెండ్ లో సుమారుగా 200 కి పైగా థియేటర్స్ ని పెంచారు. ఫలితంగా వసూళ్లు కూడా బాగా పెరిగాయి. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 6 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ లో 19 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమాకి 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే అవకాశం ఉన్నాయి.