Abhishek Sharma 2.0 transformation: ఫుల్లర్ లెంగ్త్ బంతులు ఆడలేడు. షార్ట్ పిచ్ బంతులు వేస్తే తట్టుకోలేడు.. ఇన్ సైడ్ స్వింగర్ బంతులను ఎదుర్కొలేడు.. వేగంగా ఆడే క్రమంలో తప్పులు చేస్తాడు. అతడికి అవకాశాలు ఇవ్వడం కంటే.. ముందు మెరుగైన శిక్షణ ఇవ్వండి.. ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత అభిషేక్ శర్మ మీద మాజీ ప్లేయర్లు చేసిన వ్యాఖ్యలు అవి.
ఆ వ్యాఖ్యలు అతడి మీద బలంగానే ప్రభావం చూపించాయి. అందువల్లే అభిషేక్ శర్మ తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో మినహా ఇటీవల కాలంలో జరిగిన అన్ని మ్యాచ్లలో అతడు అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన పరుగులు మాత్రమే కాదు.. జట్టు విజయం సాధించే స్థాయిలో రన్స్ చేశాడు. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న అభిషేక్ శర్మ.. ఆ తర్వాత కుదురుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. గతంలో అంతగా ఆకట్టుకులేని అతడు.. ఇప్పుడు తన లోపాలను పూర్తిగా అధిగమించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సరికొత్త అభిషేక్ శర్మ ను ప్రత్యర్థి ప్లేయర్లకు పరిచయం చేస్తున్నాడు.
బుధవారం జరిగిన మ్యాచ్లో కేవలం 13 బంతుల్లోనే పంజాబ్ జట్టు మీద 35 పరుగులు చేశాడు. హైదరాబాద్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతడు ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు.. నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ మెరుపు బ్యాటింగ్ చేయడం ద్వారా అభిషేక్ శర్మ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
మనదేశంలో జరిగిన టి20 మ్యాచ్లలో 300 సిక్సర్లు కొట్టిన ఆరవ ఆటగాడిగా అతడు రికార్డ్ సృష్టించాడు. రోహిత్ శర్మ 388 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. గేల్, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్ వంటి వారి సరసన అభిషేక్ స్థానం సంపాదించుకున్నాడు. కే బలం 153 మ్యాచ్లలోనే అభిషేక్ శర్మ 302 సిక్సర్లు కొట్టడం విశేషం. అభిషేక్ గనుక ఇదే ఫామ్ కొనసాగిస్తాయి ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ఎదురు ఉండదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అతడు ఇదే స్థాయిలో వచ్చే మ్యాచ్లలో కూడా బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.