https://oktelugu.com/

Abhishek Sharma : అభిషేక్ సెంచరీ బాదిన బ్యాట్ వెనుక ఇంత కథ దాగి ఉందా?

Abhishek Sharma ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ భారీ షాట్లు కొట్టాడు. లాస్టెడ్ షాట్లు కొట్టి అలరించాడు. అభిషేక్ శర్మ ఈ షాట్లు కొట్టాలని ఆయన తండ్రి సూచించాడట. అందువల్లే అభిషేక్ శర్మ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేశాడట. గిల్ వికెట్ పడిన తర్వాత.. నిదానంగా ఆడిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి చివరి పది ఓవర్ల లో ఓవర్ కు 16 పరుగుల చొప్పున బాదాడు. టి20 లలో ఇది ఒక రికార్డుగా నిలిచింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2024 / 06:24 PM IST

    Abhishek scored a century with the bat of Shubman Gill

    Follow us on

    Abhishek Sharma : ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. కోల్ కతా తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తేలిపోయినప్పటికీ.. టోర్నీ మొత్తం సత్తా చాటాడు. కీలకమైన మ్యాచులలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును గెలిపించాడు. ఐపీఎల్ లో అదరగొట్టిన అభిషేక్ శర్మ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. జింబాబ్వేతో జరిగే ఐదు t20 ల మ్యాచ్ ల సిరీస్ కు ఎంపికయ్యాడు.. ఈ క్రమంలో 23 ఏళ్ల కుర్రాడు జింబాబ్వేతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే దీంతో అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో వారందరికీ రెండవ టి20 మ్యాచ్ ద్వారా తన బ్యాటింగ్ తో సమాధానం చెప్పాడు.

    రెండవ టి20 మ్యాచ్లో తన బ్యాటింగ్ పరాక్రమాన్ని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో ప్రదర్శించాడు. జింబాబ్వే బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వాస్తవానికి 40 పరుగులు చేసేదాకా నెమ్మదిగా ఆడిన అభిషేక్.. ఆ తర్వాత తన విశ్వరూపం చూపించాడు.. ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ లలో సెంచరీ సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఫలితంగా 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడాడు. టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అండర్ -12 నుంచి గిల్ తో కలిసి తాను ఆడుతున్నట్టు వివరించాడు. ఈ మ్యాచ్ లోనూ గిల్ తో కలసి బ్యాటింగ్ చేసినట్టు వివరించాడు. ” నేను జాతీయ జట్టుకు ఎంపికైనప్పుడు గిల్ తొలి కాల్ చేసాడు. ఈ మ్యాచ్లో నేను గిల్ తో కలిసి బ్యాటింగ్ చేశాను. నేను అతడి బ్యాట్ తోనే ఆడాను. ఆ బ్యాట్ కు, గిల్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఒత్తిడి అనిపించిన మ్యాచ్ లలో కచ్చితంగా గిల్ సలహాలు అడుగుతాను. అతడి బ్యాట్ కూడా తీసుకుంటాను. అండర్ -12 దశలో ఉన్నప్పటి నుంచి ఇది కొనసాగుతోంది. ఐపీఎల్ లో కూడా మొదటి బ్యాట్ తీసుకున్నాను..నేను ఈ స్థాయిలో రాణించడానికి యువరాజ్ సింగ్ ప్రధాన కారణం. మొదటి మ్యాచ్ లో సున్నా పరుగులకే ఔటయ్యాను. కానీ రెండో మ్యాచ్ లో నేను అనుకున్న ప్రణాళిక విజయవంతమైందని” అభిషేక్ శర్మ వ్యాఖ్యానించాడు.

    ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ భారీ షాట్లు కొట్టాడు. లాస్టెడ్ షాట్లు కొట్టి అలరించాడు. అభిషేక్ శర్మ ఈ షాట్లు కొట్టాలని ఆయన తండ్రి సూచించాడట. అందువల్లే అభిషేక్ శర్మ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేశాడట. గిల్ వికెట్ పడిన తర్వాత.. నిదానంగా ఆడిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి చివరి పది ఓవర్ల లో ఓవర్ కు 16 పరుగుల చొప్పున బాదాడు. టి20 లలో ఇది ఒక రికార్డుగా నిలిచింది.