https://oktelugu.com/

Rashi Phalalu: ఈ 4 రాశుల వారు భాగస్వామితో ఉండడానికి అస్సలు ఇస్టపడరు..

Rashi Phalalu: ఆయా రాశులకు ఉన్న స్వభావంతోనే వీరు ఇలా ప్రవర్తిస్తారని చెబుతున్నారు. అయితే ఈ నాలుగు రాశులకు చెందిన వారు.. తమ జీవిత భాగస్వామి ఎంత మంచిగా ప్రవర్తించినా వారితో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడరు. వారు ఏం చెప్పినా వినరు. అవి ఏ రాశులో తెలుసా?

Written By:
  • Srinivas
  • , Updated On : July 8, 2024 / 06:17 PM IST

    Rashi Phalalu

    Follow us on

    Rashi Phalalu: జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా జీవిత భాగస్వామితో సంతోషంగా ఉన్నప్పుడే అసలైన ఆనందం ఉంటుంది. కొందరు ఈ విషయాన్ని పట్టించుకోరు. కేవలం సంపాదన, ఇతర వ్యాపకాల మీదే ధ్యాస పెడుతారు. అయితే చాలా మంది ఇలా ఉండడానికి .. వారి ప్రవర్తనలో మార్పు రావడానికి కారణం కొన్ని రాశుల ప్రభావమేనని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆయా రాశులకు ఉన్న స్వభావంతోనే వీరు ఇలా ప్రవర్తిస్తారని చెబుతున్నారు. అయితే ఈ నాలుగు రాశులకు చెందిన వారు.. తమ జీవిత భాగస్వామి ఎంత మంచిగా ప్రవర్తించినా వారితో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడరు. వారు ఏం చెప్పినా వినరు. అవి ఏ రాశులో తెలుసా?

    మేషం:
    మేషరాశికి చెందిన వారి స్వభావం చాలా విచిత్రంగా ఉంటుంది. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో ఉంటారు. తమ జీవిత భాగస్వామిని సంప్రదించకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తమ నిర్ణయాల వల్ల ఎదుటివారు ఇబ్బందులు పడుతారని అస్సలు ఆలోచించరు. తమకు అనుగుణంగా ఉన్న భార్య లేదా భర్తకు దూరంగా ఉండడానికి ఇష్టపడుతారు. రొటిన్ గా ఉండడానికి అస్సలు ఇష్టపడరు.

    మిథునం:
    ఈ రాశికి చెందిన వారు చాలా బాగా మాట్లాడుతారు. కానీ లోపల ఆలోచన వేరే ఉంటుంది. అన్ని తమకు అనుగుణంగా ఉండాలని అనుకుంటారు. సంబంధాల విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. దీంతో ఎప్పుడు నెగెటివ్ ఆలోచన ధోరణితో ఉంటారు. తమ పార్ట్ నర్ ను కచ్చితంగా తమ చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకుంటారు. లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ ఉండడానికి ఇష్టపడరు.

    ధనుస్సు:
    సంబంధాలను కలుపుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడు బిజీగా ఉంటారు. తమ భాగస్వామి ప్రేమ చూపిస్తే ఇబ్బందిగా ఫీలవుతారు. వీరి విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించలేకపోతారు. ఎంత మంచిగా ప్రవర్తించినా వారిని దూరంగా ఉంచుతారు.

    మీనం:
    ఈ రాశి వారు పైకి ఒకలాగా.. లోపల మరోలాగా ఉంటారు. పైకి ప్రేమ చూపిస్తున్నట్లు కనిపిస్తారు. భాగస్వామి కదలికను ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంటారు. ఏ విషయం గురించైనా ఎమోషనల్ గా రెస్పాండ్ అవుతారు. బావోద్వేగాలను తట్టుకోలేరు.