https://oktelugu.com/

Kalki 2898 AD : కల్కి 11 డేస్ కలెక్షన్స్… అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ప్రభాస్.. కెజిఎఫ్ 2 రికార్డు బద్దలేనా?

Kalki 2898 AD ఆదివారం కల్కి తెలుగులో రూ. 14 కోట్ల రూపాయలు, తమిళంలో రూ. 3 కోట్లు, హిందీలో రూ. 22 కోట్లు, కన్నడలో రూ. 5 కోట్లు, మలయాళంలో రూ. 2 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఇండియాలో 44 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టిందని వెల్లడించారు. ఇక ఓవర్సీస్ లో కల్కి చిత్రం ఇప్పటివరకు $30 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 11వ రోజు ఓవర్సీస్ లో రూ. 8.5 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా.

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2024 / 06:29 PM IST

    Kalki 11 Days Box Office Collections

    Follow us on

    Kalki 2898 AD : ప్రభాస్ నటించిన కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. కల్కి సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా కూడా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే రూ. 900 కోట్ల మైలు రాయిని దాటింది. త్వరలోనే రూ. 1000 కోట్లకు చేరుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా కల్కి 11వ రోజు సత్తా చాటింది.

    ఆదివారం కల్కి తెలుగులో రూ. 14 కోట్ల రూపాయలు, తమిళంలో రూ. 3 కోట్లు, హిందీలో రూ. 22 కోట్లు, కన్నడలో రూ. 5 కోట్లు, మలయాళంలో రూ. 2 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఇండియాలో 44 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టిందని వెల్లడించారు. ఇక ఓవర్సీస్ లో కల్కి చిత్రం ఇప్పటివరకు $30 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 11వ రోజు ఓవర్సీస్ లో రూ. 8.5 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా.

    గత పది రోజులుగా కలెక్షన్ల వివరాలు పరిశీలిస్తే .. ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లో ఈ సినిమా రూ. 153 కోట్ల షేర్ వసూలు చేసింది. రూ. 236 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 507 కోట్ల గ్రాస్, 200 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో $30 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అత్యధికంగా యూఎస్ లో $15 మిలియన్ వసూళ్లకు పైగా అందుకుంది. దాంతో ఈ సినిమా పది రోజుల్లో రూ. 845 కోట్లు రాబట్టింది. ఇక కల్కి ప్రపంచవ్యాప్తంగా 11వ రోజు 55 కోట్ల నుంచి 60 కోట్ల మధ్యలో వసూళ్లు రాబట్టింది అంచనా.

    దీంతో కల్కి మూవీ రూ. 900 వందల కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారంతో పోలిస్తే సెకండ్ వీకెండ్ కలెక్షన్లు మరింత పెరిగాయని తెలుస్తుంది. ఇక త్వరలో కల్కి 2898 ఏడీ చిత్రం 1000 కోట్ల మార్కును టచ్ చేయనుంది. కాగా కెజిఎఫ్ 2 పేరిట ఉన్న రూ. 1200 కోట్ల రికార్డును కల్కి బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కి కూడా కల్కి చేరువలో ఉంది. భారతీయుడు 2 విడుదలయ్యే వరకు పెద్దగా పోటీ లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి చిత్రంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రలు చేశారు.